Share News

Vande Bharat Sleeper: వామ్మో.. వందే భారత్ స్లీపర్ ట్రెయిన్‌లో ఇన్ని ఫీచర్సా!

ABN , Publish Date - May 06 , 2024 | 06:06 PM

వందే భారత్ రైలు భద్రతా ప్రమాణాలను పరీక్షించే కాంట్రాక్ట్‌ను ఆర్ఐటీఈఎస్ సంస్థకు రైల్వే శాఖ తాజాగా ఇచ్చింది. ఇటల్‌సర్టిఫయర్ ఎస్‌పీఏతో సంయుక్తంగా ఆర్ఐటీఈఎస్ ఈ తనిఖీలు చేపడుతుంది.

Vande Bharat Sleeper: వామ్మో.. వందే భారత్ స్లీపర్ ట్రెయిన్‌లో ఇన్ని ఫీచర్సా!

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం రైల్వే ప్రయాణికులను అమితంగా ఆకర్షిస్తున్నాయి వందేభారత్ రైళ్లు. ఆధునిక సౌకర్యాలున్న ఈ రైళ్లకు భారీ డిమాండ్ ఉంటోంది. ఈ నేపథ్యంలో వందేభారత్ స్లీపర్ రైళ్లను కూడా ప్రారంభించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ సర్వీసు ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ప్రయాణికులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ వీటిని ప్రారంభించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ దిశగా తాజాగా మరో ముందడుగు పడింది.

వందేభారత్ రైలు భద్రతా ప్రమాణాలను పరీక్షించే కాంట్రాక్ట్‌ను (Safety Assesment) ఆర్ఐటీఈఎస్ (RITES) సంస్థకు రైల్వే శాఖ తాజాగా ఇచ్చింది. ఐటల్‌సర్టిఫయర్ ఎస్‌పీఏతో సంయుక్తంగా ఆర్ఐటీఈఎస్ ఈ తనిఖీలు చేపడుతుంది. మరోవైపు, ప్రయాణికుల అంచనాలను అందుకునేలా రైల్వే శాఖ (Indian Railways) వందే భారత్ స్లీపర్‌‌ను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దుతోంది. రాజధాని, తేజస్ ఎక్స్‌ప్రెస్‌లను తలదన్నేలా వీటి ఫీచర్లు ఉండనున్నాయి.

Sweat Rice balls: అందమైన యువతుల చంకలోని చెమటతో ఘుమఘుమలాడే డిష్.. తెగ తింటున్న జనాలు!


కళ్లుచెదిరే వసతులు (Features of VandeBharat Sleeper)

  • వందే భారత్‌లో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయట. వీటిలో 11 ఏసీ 3 టైర్, నాలుగు ఏసీ 2 టైర్, రెండు ఏసీ ఫస్ట్ కోచ్ ఉంటుంది. ఒకేసారి 823 మంది ప్రయాణికులు తరలించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏసీ 3 టైర్‌లో 611, ఏసీ 2 టైర్‌లో 188 మంది, ఏసీ ఫస్ట్ క్లాస్‌లో 24 మంది ఉంటారు.

  • అత్యధికులు ప్రయాణించే ఏసీ 3 టైర్‌లో అత్యాధునిక సౌకర్యాలను సిద్ధం చేస్తున్నారు. వీటిల్లోని బెర్తుల్లో ఎక్స్ట్రా కుషన్ ఏర్పాటు చేస్తు్నారు. రాజధాని కంటే మెరుగ్గా బెర్తులను సిద్ధం చేస్తున్నారు.

  • కోచ్‌లో వాతావరణం కంటికి ఇంపుగా ఉండేలా క్రీమ్, పసుపు రంగులకు చెందిన వివిధ షేడ్స్‌ను వినియోగిస్తారు. అప్పర్, మిడిల్ బెర్తులను ఎక్కేందుకు మరింత అనువైన నిచ్చెనను డిజైన్ చేశారు.

  • రైల్లో అంతటా సెన్సార్ ఆధారిత లైట్లను ఏర్పాటు చేస్తారు. విద్యుత్ తక్కువగా వినియోగిస్తూ రాత్రుళ్లు కావాల్సినంత వెలుతురును అందించేలా లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. సులువుగా నడిచేందుకు వీలుగా రైలు ఫ్లొర్‌లపై స్ట్రిప్స్‌ను కూడా వినియోగిస్తున్నారు.

  • సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్ డోర్లు, శబ్ద కాలుష్యం తగ్గించేందుకు నాయిస్ ఇన్సులేషన్, సెలూన్ స్పేస్, దివ్యాంగులకు కూడా అనువుగా ఉంటే టాయిలెట్లను రైల్లో ఏర్పాటు చేస్తారు.

Viral: ట్రాఫిక్‌లో జాంలో ఇరుక్కున్నప్పుడు ఈ పొరపాటు మాత్రం చేయొద్దు.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో!

  • రైలు టాయిలెట్లలో దుర్వాసన రాకుండా ఉండే వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. మాడ్యులార్ ఫిట్టింగ్స్‌తో కూడిన బయో వ్యాక్యూమ్ టాయిలెట్స్ ఉంటాయి. నీరు చిందకుండా ఉండేందుకు వాష్ బెసిన్స్‌లో కూడా యాంటీ స్పిల్లేజ్ ఫీచర్లు ఉంటాయి.

  • ప్రయాణ అనుభవం మెరుగ్గా ఉండేలా ఇంటీరియర్స్‌ను అత్యాధునికంగా డిజైన్ చేస్తున్నారు. జీఎఫ్‌ఆర్‌పీ పానల్స్, పబ్లిక్ అనౌన్స్‌‌మెంట్ వ్యవస్థ, విసువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వంటి అత్యాధునిక ఫీచర్లు జోడిస్తున్నారు.

  • ప్రయాణాల్లో కుదుపులు తక్కువగా ఉండేందుకు రైల్లో సెమీ పర్మెనెంట్ కప్లర్స్ వాడుతారు. దీంతో, ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది.

  • కోచ్‌ల మధ్య ప్రయాణానికి వీలుగా పూర్తిగా మూసి ఉంచిన గ్యాంగ్‌వేస్‌ను డిజైన్ చేశారు. ఇది వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లోని వ్యవస్థ మాదిరిగానే ఉంటుంది.

  • ఇవి సెమీ హైస్పీడ్ రైళ్లు కావడంతో గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని రైల్వే శాఖ చెబుతోంది. అయితే, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నమూనా రైలును గరిష్ఠంగా 180 కిలోమీటర్ల వేగం వద్ద పరక్షిస్తారు. ఈ స్లీపర్ రైలు అందుబాటులోకి వచ్చాక రాత్రి ప్రయాణాల సమయం చాలా వరకూ తగ్గుతుందని రైల్వే శాఖ చెబుతోంది.

Read National and Telugu News

Updated Date - May 06 , 2024 | 06:37 PM