Share News

Viral: రోజూ స్నానం చేయని భర్త! విసుగెత్తిపోయిన భార్య ఏం చేసిందంటే..

ABN , Publish Date - Sep 15 , 2024 | 09:05 PM

తన భర్త రోజూ స్నానం చేయకపోవడంతో దుర్వాసన భరించలేక ఓ మహిళ డైవర్స్‌‌కు సిద్ధమైంది. పెళ్లైన 40 రోజులకే విడాకులు కోరుతూ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించింది.

Viral: రోజూ స్నానం చేయని భర్త! విసుగెత్తిపోయిన భార్య ఏం చేసిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: తన భర్త రోజూ స్నానం చేయకపోవడంతో దుర్వాసన భరించలేక ఓ మహిళ డైవర్స్‌‌కు సిద్ధమైంది. పెళ్లైన 40 రోజులకే ఆమెకు విసుగొచ్చి విడాకులు కోరుతూ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించింది. మహిళ చెప్పిన కారణం విని అక్కడి సిబ్బంది కూడా షాకైపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ ఘటన వెలుగు చూసింది (Viral).

మహిళ ఫిర్యాదు ప్రకారం, ఆమె భర్త నెలకు ఒకసారో రెండు సార్లో మాత్రమే స్నానం చేస్తాడట. దీంతో, అతడి శరీర దుర్గంధం భరించలేకపోతున్నానని ఆమె వాపోయింది. ఇంత అపరిశుభ్రంగా ఉండే వ్యక్తితో కలిసి ఉండలేనని స్పష్టం చేసింది.

Viral: తలస్నానం చేస్తూ గట్టిగా తుమ్మాడు! ముక్కులోంచి బయటకొచ్చిందేంటో చూసి..


అసలేం జరిగిందని యువతి భర్తను ప్రశ్నించగా అతడి సమాధానం అధికారులను ఆశ్చర్యపరిచింది. తాను నెలకు ఒకటో రెండో మార్లు మాత్రమే స్నానం చేస్తానని అతడు ఎటువంటి సంకోచం లేకుండా అంగీకరించాడు. వారానికి ఒకసారి ఒంటిపై గంగాజలం జల్లుకుని అక్కడితో సరిపెడతానని అన్నాడు. అయితే, తమకు పెళ్లైన తరువాత భార్య పోరు పడలేక 40 రోజుల్లో ఆరు సార్లు స్నానం చేశానని మాత్రం చెప్పాడు.

Locomotive In Field: పొలంలో రైలు ఇంజెన్ ప్రత్యక్షం.. జనాలకు షాక్!


పెళ్లైన కొన్ని రోజులకే నవ దంపతుల మధ్య ఈ విషయంలో తగాదాలు మొదలయ్యాయని కన్సెలర్ మీడియాకు తెలిపారు. ఈ గొడవలు భరించలేక యువతి తన పుట్టింటికి వెళ్లిపోయిందని చెప్పారు. ఆ తరువాత భర్త కుటుంబంపై వారు కట్నం వేధింపుల కేసు కూడా పెట్టారని అన్నారు. డైవర్స్ కావాలని డిమాండ్ చేసినట్టు వెల్లడించారు. అయితే, ఈ విషయంలో పోలీసులు కూడా జోక్యం చేసుకోవడంతో ఆ భర్త రోజూ స్నానం చేసేందుకు ఓకే చెప్పాడు. అయితే, భార్య మాత్రం అతడితో కలిసుండేది లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ నెల 22న మరోసారి కౌన్సెలింగ్‌కు రావాలని కౌన్సెలింగ్ సెంటర్ వారు ఆ దంపతులకు సూచించారు.

Viral: సక్సెస్ అంటే ఇదీ.. సిలికాన్ వ్యాలీలోని ఈ ఎన్నారై ఇల్లు చూస్తే..

Read Latest and Viral News

Updated Date - Sep 15 , 2024 | 09:05 PM