Share News

Viral: స్విగ్గీలో రూ.8,32,032లతో ఆర్డర్ పెట్టి సరికొత్త రికార్డు! ఇతడేం కొన్నాడో తెలిస్తే..

ABN , Publish Date - Dec 28 , 2024 | 02:53 PM

ధనత్రయోదశినాడు అహ్మదాబాద్ వ్యక్తి ఏకంగా రూ.8 లక్షల పైచిలుకు విలువైన బంగారు నాణేలు కొనుగోలు చేసి స్విగ్గీ ఇన్‌మార్ట్ వేదికగా రికార్డు సృష్టించాడు.

Viral: స్విగ్గీలో రూ.8,32,032లతో ఆర్డర్ పెట్టి సరికొత్త రికార్డు! ఇతడేం కొన్నాడో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: క్విక్ కామర్స్ రంగం మంచి ఊపుమీద ఉంది. కేవలం పదిహేను నిమిషాల్లోనే కావాల్సినవి డెలివరీ అవుతుండటంతో అనేక మంది పచారీ సామాన్లు మొదలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వరకూ అన్నీ క్విక్ కామర్స్ యాప్‌లల్లో ఆర్డర్ పెడుతున్నారు. పరిస్థితి ఎంతలా ముదిరిందంటే ఓ వ్యక్తి ఏకంగా బంగారు నాణేలనే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో కొనుగోలు చేశారు. ఈ ఏడాది సంస్థకు ఇచ్చిన ఆర్డర్లకు సంబంధించి కొత్త చరిత్ర సృష్టించారు. మరో రెండు రోజుల్లో ఈ ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో జనాల కొనుగోళ్ల తీరుతెన్నులపై స్విగ్గీ ఓ నివేదిక విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 1 వరకూ వచ్చిన ఆర్డర్ల ఆధారంగా ఈ నివేదిక రూపొందించింది (Viral).

Viral: వధువుకు షాక్! రొట్టెలు లేటుగా వడ్డించారని మరో యువతిని పెళ్లాడిన వరుడు!


  • స్విగ్గీ నివేదిక ప్రకారం, అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ధనత్రయోదశి నాడు ఏకంగా రూ.8,32,032 విలువైన బంగారు నాణేలను ఇన్‌స్టామార్ట్ ద్వారా కొనుగోలు చేసి చరిత్ర సృష్టించాడు.

  • ఈ ఏడాది అత్యధికంగా కండోమ్‌ల ఆర్డర్లు ఇచ్చిన నగరంగా బెంగళూరు టాప్ స్పాట్‌లో నిలిచింది.

  • జనాలు రాత్రి వేళ చిరుతిళ్లకు అలవాటు పడుతున్నారు. ఫలితంగా స్విగ్గీలో రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య ఆర్డర్లు పతాకస్థాయికి చేరుతున్నాయి. మసాలా ఫ్లేవర్ చిప్స్, కుర్కురే వంటివి ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. ఈ కేటగిరీలో ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు నగరాలు టాప్‌లో నిలిచాయి.

  • ఢిల్లీ, డెహ్రాడూన్ నగర వాసులు షాపింగ్‌పై ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ఆటా, పాలు పెరుగు వంటి వాటికి రెండు నగరాల్లో కలిపి ఏకంగా రూ.20 లక్షల మేర ఖర్చు చేశారు.

Viral: మార్చరీలో జాబ్‌కు వింత పరీక్ష.. శవాల మధ్య 10 నిమిషాల పాటు..


  • దేశవ్యాప్తంగా పాలు, పెరుగు, దోస పిండి, చిప్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా స్విగ్గీలో అమ్ముడుపోయాయి.

  • ముంబైకి చెందిన పెంపుడు జంతువు యజమాని ఒకరు తన నేస్తం కోసం ఏకంగా రూ.15 లక్షల విలువైన ఉత్పత్తులు కొని రికార్డు నెలకొల్పారు.

  • టానిక్ వాటర్ కొనుగోళ్లపై ఒక్క రోజులో రూ. 8,20,360 ఖర్చు చేసిన నగరంగా ముంబై గుర్తింపు సొంతం చేసుకుంది. గోవాలో ఓ వ్యక్తి ఏకంగా టానిక్ వాటర్‌పై రూ.35 వేలు ఖర్చు చేశాడు.

  • ఢిల్లీ వాసులు ఇన్‌స్టంట్ నూడుల్స్‌పై ఏకంగా రూ.60 కోట్లు ఖర్చు చేశారు.

  • వైజాగ్ వాసులు బొమ్మలపై రూ.27472 ఖర్చు చేసినట్టు స్విగ్గీ నివేదిక పేర్కొంది.

Viral: వాహనదారుడికి షాక్.. రోడ్డుపై వెళుతుండగా హెల్మెట్‌లోని పాము కాటేయడంతో..

  • ఈ ఏడాది అత్యంత వేగవంతమైన డెలివరీ కొచ్చీలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అరటిపళ్లు ఆర్డర్ పెట్టిన 89 సెకెన్లకే అవి ఇంటికి డెలివరీ అయ్యాయి.

  • అత్యంత చవకైన ఆర్డర్ హైదరాబాద్‌లో వెలుగు చూసింది. ఇక్కడో వ్యక్తి రూ.3తో పెన్సిల్ షార్పనర్ ఆర్డర్ చేశారు.

  • బ్యాగ్ అవసరం లేకుండా వస్తువుల డెలివరీపై హైదరాబాద్, బెంగళూరు నగరవాసులు ఎక్కువగా ఆసక్తి చూపారు.

Read Latest and Viral News

Updated Date - Dec 28 , 2024 | 03:01 PM