Share News

Viral: అద్భుతం.. ఏనుగులను రైలు ఢీకొనకుండా కాపాడిన ఏఐ కెమెరా!

ABN , Publish Date - Dec 10 , 2024 | 09:31 PM

పట్టాలు దాటుతూ రైలు ఢీకొని ఏనుగులు ప్రాణాలు పోగొట్టుకుంటున్న నేపథ్యంలో అధికారులు ఏఐ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రయత్నం సత్ఫలితాలు ఇస్తున్నట్టు ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Viral: అద్భుతం.. ఏనుగులను రైలు ఢీకొనకుండా కాపాడిన ఏఐ కెమెరా!

ఇంటర్నెట్ డెస్క్: ప్రకృతి పరిరక్షణకు ఏనుగులు ఏంతో కీలకం. వీటిని శాస్త్రజ్ఞులు కీస్టోన్ జంతుజాతి అని పిలుస్తారు. అంతటి కీలకమైన ఏనుగులు అనేకం పట్టాలు దాటుతూ రైలు ఢీకొట్టి మరణించిన ఘటనలు అనేకం వెలుగు చూశాయి. ఈ సమస్యకు పరిష్కారంగా అటవీ శాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణగా ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది (Viral).

Viral: ‘ఒత్తిడి ఎక్కువైందన్నందుకు ఉద్యోగుల తొలగింపు’ వార్తపై సంస్థ క్లారిటీ!


ఏనుగులకు ప్రమాదం జరగకుండా అత్యాధునిక ఏఐ కెమెరాలు ఎలా అడ్డుకున్నదీ చెబుతూ ఆయన ఈ వీడియో షేర్ చేశారు. ఎనుగులు పట్టాలు దాటే పలు ప్రాంతాల్లో అధికారులు పట్టాల వెంబడి ఏఐ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు అధికారి తెలిపారు. ఏనుగులు పట్టాలను సమీపిస్తున్న సమయంలో ముందస్తుగానే ఈ కెమెరాలు గుర్తించి అటవీ శాఖ, రైల్వే శాఖలను అప్రమత్తం చేస్తాయని తెలిపారు. తాజా ఘటనలో ఏఐ కెమెరాల అలర్టులతో అప్రమత్తమైన అధికారులు రైలును ఆపి, ఏనుగులను మరో మార్గంలోకి మళ్లించారని తెలిపారు. ‘‘ఈ ప్రయత్నాలతో మంచి ఫలితాలు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆర్‌ఎస్పీ నిధులతో వీటిని ఏర్పాటు చేశారు. రూర్కేలా ఫారెస్ట్ డివిజన్ పరిధిలో పైలట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేశారు. త్వరలో ఈ కార్యక్రమాన్ని కెన్‌జోహార్, బోనాయ్ ఫారెస్ట్ డివిజన్‌కు విస్తరిస్తాము’’ అని పేర్కొన్నారు.

Viral: ఊబెర్ డ్రైవర్ ఆదాయం చూసి పేటీఎం ఫౌండర్ ఆశ్చర్యం!


వీడియోపై పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. అటవీ శాఖ చేపడుతున్న చర్యలపై అనేక మంది హర్షం వ్యక్తం చేశారు. గజరాజులను కాపాడుకోవడం అందరి కర్తవ్యమని కొందరు వ్యాఖ్యానించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.

Elon Musk: నేను అప్పుడే చెప్పా.. కానీ నాకు మతి లేదని అన్నారు: ఎలాన్ మస్క్

Read Latest and Viral News

Updated Date - Dec 10 , 2024 | 09:39 PM