Share News

Viral: రాధికా మర్చెంట్ బర్త్‌డే వేడుక.. వదిన కేక్ ఇస్తే వద్దన్న ఆకాశ్ అంబానీ!

ABN , Publish Date - Oct 18 , 2024 | 04:34 PM

ముఖేశ్ అంబానీ ఇంట కొత్త కోడలు రాధికా మర్చెంట్ పుట్టిన రోజు వేడుక వైభవంగా జరిగింది. తన మరిదికి రాధిక కేక్ ఇస్తుండగా ముందు అమ్మమ్మకు ఇవ్వాలని అతడు సూచించిన వైనం ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

 Viral: రాధికా మర్చెంట్ బర్త్‌డే వేడుక.. వదిన కేక్ ఇస్తే వద్దన్న ఆకాశ్ అంబానీ!

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్‌ల వివాహం ఈ ఏడాది జులైలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. దేశవిదేశాల్లోని ప్రముఖులు ఈ వేడుకకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇదిలా ఉంటే కొత్త కోడలు రాధికా మర్చెంట్ ఇటీవలే తన మెట్టినింట్లో తొలి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ముంబైలో ముఖేశ్ అంబానీకి చెందిన యాంటీలియాలో బుధవారం ఆమె 30వ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. అంబానీ, మర్చెంట్ కుటుంబాల వారితో పాటు జాహ్నవీ కపూర్, ధోనీ, అనన్యా పాండే, సుహానా, ఆర్యన్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ వంటి సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరయ్యారు (Viral).

Mirrors in the Lift: లిఫ్టు‌ల్లో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా?


కాగా, ఈ వేడుకల్లో జరిగిన ఆసక్తికర సన్నివేశం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అత్తవారి ఇంట్లో తన తొలి పుట్టిన రోజు జరుపుకున్న రాధికా మర్చెంట్ ఎప్పటిలాగే కేక్ కట్ చేశారు. ఆ తరువాత కేక్‌‌ను తన భర్తకు ఇచ్చారు. అనంతరం, ఇతర కుటుంబసభ్యులకు ఇచ్చారు. ముఖేశ్ అంబానీతో పాటు రాధిక తల్లిదండ్రులు శైలా, వీరేన్ మర్చెంట్ కూడా కేక్ తిన్నారు. అయితే, తన మరిది ఆకాశ్ అంబానీకి రాధిక కేక్ అందిస్తుండగా అతడు వద్దన్నట్టు వారించాడు. ముందుగా తన బామ్మ కోకిలా బెన్ వైపు చూపిస్తూ ఆమెకు తినిపించాలని సూచించారు. తన అమ్మమ్మ పూర్నిమా దలాల్‌ కూడా కేక్ ఇవ్వాలని సూచించాడు. ఆమెను కూడా ముందుకు రమ్మన్నాడు. అమ్మమ్మ, బామ్మలకు తొలి ప్రాధాన్యం ఇస్తూ ఆకాశ్ అంబానీ తనకు పెద్దలపట్ల ఉన్న గౌరవమర్యాదలు చాటుకున్న విధానం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.

Viral: భూమ్మిద నూకలు ఇంకా మిగిలుండటం అంటే ఇదే! షాకింగ్ వీడియో!


ఇక ఈ వేడుకల్లో రాధికా మర్చెంట్ తెల్లటి దుస్తుల్లో మెరిసిపోయారు. ఈ పార్టీలో ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ, ఆనంద్ పిరామాల్ ,రాధిక తల్లిదండ్రులు, సోదరి అంజలీ మర్చెంట్ కూడా పాల్గొన్నారు.

Read Latest and Viral News

Updated Date - Oct 18 , 2024 | 04:46 PM