Viral: వామ్మో.. అంబానీల పెంపుడు కుక్కకు రూ.4 కోట్ల ఖరీదైన కారు!
ABN , Publish Date - Jul 18 , 2024 | 08:03 PM
అంబానీల పెంపుడు కుక్క హ్యాపీకి రూ.4 కోట్ల ఖరీదైన బెంజ్ కారు ఉందన్న వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు హాజరైన ఈ వేడుక న భూతో న భవిష్యత్ అన్న రీతిలో సాగింది. పెళ్లి విషయాలకు సంబంధించి అనేక కథనాలు ప్రచురితమయ్యాయి. భారత అపరకుబేరుడి వివాహం ఇంత అంగరంగ వైభవంగా జరిగిందా? అంటూ జనాలు ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉంటే తాజాగా, అంబానీల పెంపుడు కుక్క హ్యాపీకి సంబంధించి ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం వైరల్ ((Viral) అవుతోంది.
వాస్తవానికి ‘హ్యాపీ’కి సంబంధించిన ఫొటోలు గతంలోనే నెట్టింట వైరల్ అయినా ఇందుకు సంబంధించి మరో ఆశ్చర్యకర వార్త తాజాగా నెటిజన్లు నోరెళ్లబెట్టేలా చేస్తోంది. హ్యాపీ కోసం ప్రత్యేకంగా ఓ మెర్సిడీజ్ బెంజ్ కారు ఉందనేది ఈ వార్త సారాంశం. దాని ఖరీదు ఏకంగా రూ.4 కోట్లని autobrilliantardent అకౌంట్‌లో ఓ కథనం ప్రస్తుతం సంచలనం రేపుతోంది (Ambani dog Happy owns a luxury car worth Rs 4 crore).
Viral: వార్నీ..ఈ సీన్ ఎప్పుడూ చూడలేదే! బస్సు టాపు ఎక్కి కాకుల జర్నీ..
ఈ కథనం ప్రకారం, హ్యాపీ కుక్క కోసం మెర్సిడీజ్ బెంజ్ జీ 400డీ కారు ఏర్పాటు చేశారట. వాస్తవానికి అంబానీలకు ఇంతకంటే ప్రత్యేకమైన కార్లు ఉన్నాయి. జీ63ఏఎమ్‌జీ లాంటి కార్లు అంబానీల సొంతం. వాటితో పోలిస్తే జీ400డీ స్టైల్, ఫీచర్స్‌లో తేలిపోతుంది. అయితే, పెంపుడు కుక్క కోసమే దీన్ని అరేంజ్ చేశారట. ఇక హ్యాపీ అంతకుముందు ఫార్చూనర్, వెల్‌ఫైర్ కార్లలో తిరిగిందని సమాచారం.
జులై 12న అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్‌ల వివాహం జరిగిన విషయం తెలిసింది. ఆ తరువాత జులై 13న వధూవరులను ఆశీర్వదించే కార్యక్రమం, జులై 14న రిసెప్షన్ నిర్వహించారు. జులై 13 కార్యక్రమానికి స్వయంగా ప్రధాని మోదీ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇక పెళ్లి అనంతరం నూతన వధూవరులు జామ్‌నగర్‌కు వెళ్లగా అక్కడ వారికి ఘన స్వాగతం లభించింది. అంబానీల దృష్టిలో జామ్‌నగర్‌కు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. రిలయన్స్ సంస్థల వ్యవస్థాపకుడు ధీరూబాయ్ అంబానీ అక్కడే జన్మించారు.