Share News

Viral: ఈత రాని యువతికి డబ్బులు ఆశ పెట్టి నీటిలో దూకమన్న ఇన్‌ఫ్లుయెన్సర్.. చివరకు

ABN , Publish Date - May 31 , 2024 | 03:46 PM

ఇన్‌ఫ్లుయెన్సర్ల ఆగడాలు ఒక్కోసారి హద్దుమీరుతున్నాయి. ఇప్పటికే అనేక మంది ప్రాంక్ వీడియోలు చేసి విమర్శల పాలయ్యారు. తాజాగా అమెరికాలోని ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ మరో దారుణానికి పాల్పడింది. ఈత రాని యువతికి డబ్బులు ఆశ చూపి సరస్సులోకి దింపింది.

Viral: ఈత రాని యువతికి డబ్బులు ఆశ పెట్టి నీటిలో దూకమన్న ఇన్‌ఫ్లుయెన్సర్.. చివరకు
Influencer pays woman to jumb into lake

ఇంటర్నెట్ డెస్క్: ఇన్‌ఫ్లుయెన్సర్ల ఆగడాలు ఒక్కోసారి హద్దుమీరుతున్నాయి. ఇప్పటికే అనేక మంది ప్రాంక్ వీడియోలు చేసి విమర్శల పాలయ్యారు. తాజాగా అమెరికాలోని ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ మరో దారుణానికి పాల్పడింది. ఈత రాని యువతికి డబ్బులు ఆశ చూపి సరస్సులోకి దింపింది. దీంతో, ఆ యువతి ప్రమాదపు అంచుల వరకూ వెళ్లింది. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ గా (Viral) మారింది.

నాటరీ రేయనల్డ్స్ అనే యూట్యూబర్ బుధవారం ఓ లైవ్ కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఇందులో భాగంగా ఆస్టిన్ నగరంలోని ఓ యువతికి డబ్బులు ఆశ చూపి లేడీ బర్డ్ సరస్సులో ఈత కొట్టమని పురమాయించింది. తొలుత ఆ యువతి కుదరదని చెప్పినా తాను ఉన్నానని నాటలీ భరోసా ఇచ్చింది. ఆ తరువాత యువతి నాటలీ చెప్పినట్టుగానే నీటిలో దూకేసింది. చివరకు ఈత రాక కేకలు పెట్టింది. యువతి నీటిలో దూకదని నాటలీ భావించిందో ఏమో గానీ ఆమె నీట మునుగుతుంటే కంగారు పడి అక్కడి నుంచి పారిపోయింది.

Viral: కారులో స్విమ్మింగ్ పూల్.. యూట్యూబర్‌పై కేసు


నాటలీ ఫ్రెండ్స్ కూడా ఆమెనే తప్పుపట్టారు. తను చెప్పినందుకే యువతి నీళ్లల్లో దూకిందని స్పష్టం చేశారు. కానీ నాటలీ వారిని తోసిపుచ్చింది. ఈలోపు అక్కడున్న వారు అత్యవసర సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో కొలనులో ఉన్న యువతిని వారు బయటకు తీశారు. ఈలోపు, మరో వీడియో నెట్టింట పంచుకున్న నాటలీ తన తప్పేమీ లేదని చెప్పే ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Viral: ఎండ నుంచి బిడ్డను కాపాడేందుకు పావురాయి ప్రాణత్యాగం.. వైరల్ వీడియో!

Read Viral and Telugu News

Updated Date - May 31 , 2024 | 04:01 PM