Share News

Viral Video: దుబాయ్ వరదలే కాదు.. ఒళ్లు గగుర్పొడిచే ఈ రెండు వీడియోలు చూస్తే ప్రకృతి శక్తి ఏంటో తెలుస్తుంది..!

ABN , Publish Date - Apr 21 , 2024 | 10:46 AM

ప్రపంచంలోని గొప్ప నగరాల్లో ఒకటిగా, షాపింగ్ హబ్‌గా పేరు గాంచిన దుబాయ్‌కు తాజా తుఫాను చుక్కలు చూపించింది. అత్యంత సురక్షితమైన నగరం అనే భ్రమలను తొలగించింది. ప్రకృతి కోపం ముందు ఎంత టెక్నాలజీ అయిన నిలవలేదని నిరూపితమైంది.

Viral Video: దుబాయ్ వరదలే కాదు.. ఒళ్లు గగుర్పొడిచే ఈ రెండు వీడియోలు చూస్తే ప్రకృతి శక్తి ఏంటో తెలుస్తుంది..!
Snowfall in UAE and Tornado in America

ప్రపంచంలోని గొప్ప నగరాల్లో ఒకటిగా, షాపింగ్ హబ్‌గా పేరు గాంచిన దుబాయ్‌ (Dubai)కు తాజా తుఫాను చుక్కలు చూపించింది. అత్యంత సురక్షితమైన నగరం అనే భ్రమలను తొలగించింది. ప్రకృతి కోపం ముందు ఎంత టెక్నాలజీ అయిన నిలవలేదని నిరూపితమైంది. దుబాయ్ వరదల (Dubai Floods) ధాటికి అంతర్జాతీయ విమానాశ్రయం అతలాకుతలమైంది. ఎంతో మంది ప్రముఖులు ప్రస్తుతం దుబాయ్‌లో చిక్కుకుపోయి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.


దుబాయ్ వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారిని కలవరపాటుకు గురి చేశాయి. ఈ నేపథ్యంలో మరో రెండు వీడియోలు కూడా నెట్టింట హల్‌చల్ చేస్తూ ప్రకంకపనలు సృష్టిస్తున్నాయి. వాటిల్లో తొలి వీడియోను యూఏఈలోనూ, రెండో వీడియోను అమెరికాలోని కాలీఫోర్నియాలను చిత్రీకరించారు. మొదటి వీడియో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అల్-ఐన్ నగరానికి చెందినది. ఆ నగరంలో ఈ ఏడాది కురిసిన భారీ హిమపాతం చూస్తే షాకవ్వాల్సిందే (Snowfall in UAE ).


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అల్లా కోపం కారణంగానే యూఏఈలో ఇలాంటి ఉత్పాతాలు సంభవిస్తున్నాయని రాశారు. ఇక, రెండో వీడియోను అమెరికాలోని కాలీఫోర్నియాలో చిత్రీకరించారు (Tornado in America). భయంకరమైన టోర్నడో ఆ నగరాన్ని ఎలా వణికించిందో చూస్తే గూస్‌బంప్స్ రావడం ఖాయం. దుబాయ్ వరదల నేపథ్యంలో ఈ రెండు వీడియోలు మళ్లీ తెర మీదకు వచ్చాయి. లక్షల మంది ఈ వీడియోలను వీక్షించారు.

ఇవి కూడా చదవండి..

Dubai Storm: భయంకరం.. క్షణాల్లో ఆకుపచ్చగా మారిపోయిన ఆకాశం.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!


Pakistan: పాకిస్తాన్ యూట్యూబర్‌పై చున్నీ కప్పేందుకు ప్రయత్నించిన వ్యక్తి.. ఆమె షాకింగ్ రియాక్షన్ ఏంటంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 21 , 2024 | 11:05 AM