Viral: ఈ టిక్కెట్ ఎక్కడ దొరుకుతుంది.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
ABN , Publish Date - Oct 14 , 2024 | 07:00 PM
తాజా స్టార్‌షిప్ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా ఎలాన్ మస్క్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఎలాన్ మస్క్.. శాస్త్ర, వ్యాపార రంగాల్లో ఇప్పుడీ పేరు ఓ సంచలనం. మనిషి మెదుడులో అమర్చే కంప్యూటర్ చిప్స్.. డ్రైవర్ సాయంలేకుండా దూసుకెళ్లే కార్లు, భూమ్మీద ఎక్కడైనా అందుబాటులో ఉండే శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్, పునర్వినియోగ రాకెట్లు.. ఇలా సాంకేతిక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు మస్క్. ఆయన సారథ్యంలోని స్పేస్ ఎక్స్ సంస్థ తాజాగా మరో అద్భుతం సాధించింది. స్టార్ షిప్ రాకెట్లను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టాక, మళ్లీ లాంచ్ ప్యాడ్‌కు చేరేలా రూపొందించిన బూస్టర్లను తొలిసారి విజయవంతంగా ప్రయోగించింది. అంతరిక్ష రంగంలో ఇదో చారిత్రాత్మక ఘటన అంటూ నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్న వేళ ఆనంద్ మహీంద్రా కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతోంది.
Viral: రూ.23 లక్షల శాలరీ వద్దంటూ.. రూ.18 లక్షల ప్యాకేజీవైపు మొగ్గు!
స్పేస్ ఎక్స్ తాజా ప్రయోగానికి సంబంధించిన వీడియోను ఆనంద్ మహీంద్రా ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘నాకు ఈ చారిత్రాత్మక క్షణాలు వీక్షించే అవకాశం దక్కడం చాలా సంతోషంగా ఉంది. ఇలా సోఫాలో కూర్చుని ఈ దృశ్యాన్ని చూడటాన్ని ఎంజాయ్ చేశా. చరిత్రలో ఇదో కీలక ఘట్టం. అంతరిక్ష రంగం కూడా ప్రజలకు మరింత దగ్గరయ్యంది. ఓ సాధారణ విషయంగా మారుతోంది. మరి ఈ రాకెట్ ఎక్కేందుకు టిక్కెట్ ఎక్కడ దొరుకుతుంది?’’ అని మస్క్‌ను ఉద్దేశిస్తూ ఆయన పోస్టు పెట్టారు.
Viral: 15 ఏళ్లుగా లాటరీ టిక్కెట్ల కొనుగోలు! ఎట్టకేలకు అదృష్టం కలిసొచ్చి..
ఇక తాజా ప్రయోగంలో భాగంగా స్టార్ షిప్ బూస్టర్.. రాకెట్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టాక భూమివైపు పడిపోయింది. 2 వేల కిలోమీటర్ల పైబడి వేగంతో దూసుకొస్తున్న బూస్టర్‌లో తొమిది ఇంజెన్లు ఒకేసారి ఆన్ చేసి వేగాన్ని తగ్గించారు. అనంతరం, మరో మూడు ఇంజెన్లను ప్రారంభించి నియంత్రిత విధానంలో లాంచ్ టవర్ సమీపానికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో టవర్‌కు అమర్చిన మెకానికల్ చేతులు బూస్టర్‌ను ఒడిసిపట్టుకున్నాయి. బూస్టర్‌ను మళ్లి లాంచ్ ప్యాడ్ వద్ద చేర్చిన తొలి ప్రైవేటు సంస్థగా స్పేఎక్స్ రికార్డు సృష్టించింది. గతంలో స్పేఎక్స్ బూస్టర్లను.. సముద్రంలోని నావలపై ల్యాండ్ చేసేది. అక్కడి నుంచి రాకెట్ ప్రయోగకేంద్రాలకు చేర్చి మళ్లి పునర్వినియోగించేది. తద్వారా రాకెట్ ప్రయోగాల ఖర్చును గణనీయంగా తగ్గించగలిగింది. తాజాగా మరో అడుగు ముందుకేస్తు బూస్టర్లను నేరుగా లాంచ్ ప్యాడ్ మీద ల్యాండ్ చేసి చరిత్ర సృష్టించింది.