Anand Mahindra: ప్రతి సోమవారం ఇలా చేసి చూడండి.. ఆనంద్ మహీంద్రా సలహా వైరల్
ABN , Publish Date - Apr 01 , 2024 | 04:43 PM
ఆనంద్ మహీంద్రా షేర్ చేసన మరో సలహా నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ప్రతి సోమవారం మండే మోటివేషన్ (Monday Motivation) పేరిట ఇచ్చే సలహాలు, స్ఫూర్తిదాయక సూచనలు నెట్టింట అమితంగా వైరల్ (Viral) అవుతుంటాయి. తన స్వీయ అనుభవాలే కాకుండా ఎవరైనా పంచుకున్నవని కూడా ఆయన నెట్టింట షేర్ చేస్తుంటారు. జీవితాన్ని ఉత్సాహంగా స్ఫూర్తివంతంగా ఎలా గడపాలో చెబుతూ ఉంటారు. అప్పుడప్పుడు కొన్ని జీవిత పాఠాలను (Life Lessons) కూడా తన ఫాలోవర్లతో పంచుకుంటారు. అలాంటి ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
Agra: భార్య వాట్సాప్ స్టేటస్ చూసి వణికిపోయిన భర్త.. ముంచుకొస్తున్న ప్రమాదం గుర్తించి..
చాలా మంది సోమవారం నిరాశానిస్పృహలతో మొదలు పెడతారు. ఆఫీసు పని, ఇంటి పని, పిల్లల బాధ్యతలు ఇలా రకరకాల పనులతో బిజీగా గడపాల్సి వస్తోందనే కంప్లైంట్ చేస్తుంటారు. అలాంటి వారు సానుకూల దృక్పథంతో (Positive Mindset) పనులు ప్రారంభించాలంటే ప్రతి సొమవారం ముందు మనసుకు నచ్చిన ఓ పాట విన్నాకే రోజువారి పనులు ప్రారంభించాలని సూచించారు. ప్రతిరోజూ కూడా ఇదే చేయాలని చెప్పారు. ‘అందరికీ జీవితంలో పోరాటం తప్పదు. కాబట్టి, సంతోషంగా ఈ పోరాటం సాగించాలా లేక బాధతో బతుకీడ్చాలా అన్నదే మనం డిసైడ్ చేసుకోవాలి’ అని అన్నారు.
Viral: ట్రాఫిక్ జాంలో ఓ జొమాటో డెలివరీ ఏజెంట్ చేస్తోందేంటో రికార్డు చేసి నెట్టింట పెడితే..
జనాలకు ఈ సలహా బాగా నచ్చడంతో ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. తాము ప్రస్తుతం ఇలాగే చేస్తున్నామని అనేక మంది చెప్పుకొచ్చారు. జీవితంలో సానుకూల దృక్పథానికి మించిన బలం మరొకటి లేదని తెలిపారు. పాజిటివ్ మైండ్‌సెంట్ ఉంటే లైఫ్‌లో విజయం తథ్యమని పేర్కొన్నారు.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి