Share News

Viral: మీ కార్లు అంతర్జాతీయ బ్రాండ్‌లతో పోటీపడలేవన్న నెటిజన్.. ఆనంద్ మహీంద్రా రిప్లై చూస్తే..

ABN , Publish Date - Apr 30 , 2024 | 07:51 PM

మహీంద్రా కార్లు అంతర్జాతీయంగా పోటీపడలేవన్న నెటిజన్‌కు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా దీటుగా బదులిచ్చారు. కస్టమర్ల మెప్పు కోసం తాము పోరాడుతూనే ఉంటామని, వందేళ్ల తరువాత కూడా నిలిచే ఉంటామని చెప్పారు.

Viral: మీ కార్లు అంతర్జాతీయ బ్రాండ్‌లతో  పోటీపడలేవన్న నెటిజన్.. ఆనంద్ మహీంద్రా రిప్లై చూస్తే..
Anand Mahindra

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో ఎన్నో కార్ల కంపెనీలు ఉన్నా కూడా మార్కెట్‌పై తనదైన ముద్రవేసిన బ్రాండ్ మహీంద్రా అండ్ మహీంద్రా. నిత్యం సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజలు మెచ్చిన బ్రాండ్‌గా సంస్థను తీర్చిదిద్దిన ఘనత కచ్చితంగా ఆనంద్ మహీంద్రాదే. అయితే, మహీంద్రా కార్ల భవిష్యత్తుపై సందేహాలు వెలిబుచ్చుతూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టుకు ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) దిమ్మతిరిగే స్థాయిలో బదులిచ్చారు. ప్రస్తుతం ఆయన రిప్లై నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

ఆనంద్ మహీంద్రా తన ఫాలోవర్లకు కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓను పరిచయం చేశారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ మహీంద్రా కార్లు.. అమెరికా, జపాన్‌కు చెందిన అంతర్జాతీ బ్రాండ్లతో పోటీపడలేవని వ్యాఖ్యానించారు. ‘‘ఇంపోర్టు సబ్‌స్టిట్యూషన్ పాలసీలు ఉన్నంత కాలం మీరు ఎంజాయ్ చేయండి. ఆ తరువాత టారీఫ్‌లు తగ్గే కొద్దీ మహీంద్రా కార్లు కనుమరుగవుతాయి’’ అని చెప్పారు ((Anand Mahindra's reply to netizens skepticism over M and M Cars).

Viral: వీధుల్లో దుస్తులు అమ్ముకుంటున్న బాలికకు ఊహించని సర్‌ప్రైజ్! అపరిచితుడు ఇచ్చిన బాక్స్ విప్పి చూస్తే..


నెటిజన్ వ్యాఖ్యాలకు ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టారు. ‘‘మీ అనుమానాలు బయటపెట్టినందుకు ధన్యవాదాలు. కానీ ఇలాంటి వాఖ్యలు మాలో కసిని మరింత పెంచుతాయి. 1991లో నేను కంపెనీలో చేరినప్పుడు కూడా సరిగ్గా ఇలాగే అన్నారు. కార్ల తయారీ రంగం నుంచి తప్పుకోవాలని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థలు సూచించాయి. టోయోటా వంటి అంతర్జాతీయ దిగ్గజాలు దేశీ మార్కట్‌లో కాలిడినప్పుడు కూడా మమల్ని తప్పుకోమన్నారు. కానీ మేము ఇప్పటికీ నిలిచేఉన్నాం. వచ్చే 100 ఏళ్ల తరువాత కూడా మా బ్రాండ్ ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి రోజూ పోరాడుతూనే ఉంటాం...మీ మెప్పు కోసం’’ అని ముగించారు.

విమర్శకుల విషయంలో ఆనంద్ మహీంద్రా సానుకూల దృక్పథం, పోరాటపటిమ చూసి జనాలు ఫిదా అయిపోయారు. ఈ పోస్టుకు ఏకంగా 10 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇలాంటి విజన్ ఉన్న నాయకుడి నేతృత్వంలో మహీంద్రా బ్రాండ్ వందేళ్ల తరువాత కూడా నిలిచే ఉంటుందని తాను నమ్ముతున్నట్టు మరో నెటిజన్ అన్నారు.

Read Viral and Telugu News

Updated Date - Apr 30 , 2024 | 08:01 PM