Viral: 60 ఏళ్లల్లో మొదటిసారి సెలవు తీసుకున్న మహిళ.. ఎంత ఆనందమో చూడండి!
ABN , Publish Date - Apr 30 , 2024 | 03:40 PM
దాదాపు 60 ఏళ్ల తరువాత తన తల్లి పరిపూర్ణంగా తన సెలవు దిన్నాన్ని ఎంజాయ్ చేసిందని ఓ వ్యక్తి చెప్పుకొచ్చాడు. తల్లి ఫొటోను కూడా షేర్ చేశాడు. భారతీయ మహిళలను భార్యలుగా పొందే అర్హత ఇక్కడ వారికి లేదంటూ ట్వీ్ట్ చేశాడు. ఇది వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: పురుషులకు వారంలో ఒక్కరోజైనా సెలవు దొరుకుతుంది కానీ గృహిణులకు సెలవే ఉండదు. ఇంట్లో వారికి కావాల్సినవి అమర్చిపెట్టేందుకు జీవితాంతం శ్రమిస్తూనే ఉంటారు. అలాంటి ఓ మహిళ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. 60 ఏళ్ల తరువాత తన తల్లి సెలవు తీసుకుందంటూ ఓ వ్యక్తి ఈ ఉదంతాన్ని నెట్టింట షేర్ చేశాడు. దీనిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హిమాచల్ ప్రదేశ్‌లోని కోక్సార్ గ్రామానికి చెందిన ఓ మహిళ ఏకంగా ఆరు దశాబ్దాల తరువాత సెలవు తీసుకుంది. దీంతో, మంచుతో ఆడుకుంటూ చిన్న పిల్లలా మారిపోయింది. బరువు బాధ్యతల గురించిన ఆలోచనలు కాసేపు పక్కన పెట్టి హ్యాపీగా ఎంజాయ్ చేసింది. ఆరుబయట మంచుముద్దలతో ఆడుకుంది. మహిళ ఫొటోలను ఆమె కుమారుడ్ నీల్ ముక్తీ నెట్టింట పంచుకున్నాడు (Woman plays with snow in her first holiday in 60 years sons comment is trending).
Viral: బ్రేకప్ చెప్పిన బాయ్‌ఫ్రెండ్.. 2 వారాల తరువాత యువతికి అసలు విషయం తెలిసి..
‘‘కొన్నేళ్ల తరువాత మా అమ్మ పని నుంచి బ్రేక్ తీసుకుంది. ఆమె ఎప్పుడు మా నాన్న గురించి వర్రీ అవుతుండేది. నేను ఎంతో నచ్చచెబితే గానీ ఆమె ఒప్పుకోలేదు. భారతీయ మహిళలను భార్యలుగా పొందే అర్హత ఇక్కడ వారికి లేదని నాకు ఒక్కోసారి అనిపిస్తుంటుంది’’ అని అతడు కామెంట్ చేశాడు.
నీల్అభిప్రాయంతో కొందరు ఏకీభవించారు. ‘‘నాన్న గతించిన తరువాతే అమ్మ హ్యాపీగా ఉందేమోనని నాకు అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. తన తల్లికి టూర్లపై వెళ్లడమంటే ఎంతో ఇష్టమని మరో వ్యక్తి చెప్పుకొచ్చాడు. తమ కుటుంబంలో అందరికంటే ఆమే పర్యటనలను ఎక్కవగా ఎంజాయ్ చేస్తుందని అన్నారు. తన పర్యటనలకు రకరకాల వర్ణనలతో అక్షరరూపం ఇస్తుందని కూడా పేర్కొన్నాడు. అసలైన ఆనందానికి నిర్వచనం ఇదేనని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.
మరో నెటిజన్ మాత్రం నీల్ అభిప్రాయంతో విభేదించాడు. అందరికీ ఇదే వర్తిస్తుందని భావించరాదన్నాడు. అనారోగ్యంతో ఉన్న తన తల్లికి తండ్రి గత 30 ఏళ్లుగా సేవలు చేస్తున్న విషయం చెప్పాడు.