Share News

Viral Video: ముసలోడేకానీ మహానుభావుడు.. ప్రీ వెడ్డింగ్ షూట్ డైరెక్టర్‌గా ఆంధ్ర తాత..

ABN , Publish Date - May 31 , 2024 | 02:11 PM

ప్రి వెడ్డింగ్ షూట్‌లకు ఎంత ఖర్చైనా పెట్టడానికి సిద్ధమవుతున్నారు కుర్రకారు. అయితే వెడ్డింగ్ షూట్‌లో వధూవరులకు స్టిల్స్ చెప్పడం మాత్రం కెమెరామెన్, వీడియోగ్రాఫర్ పనే. కానీ ఓ చోట వృద్ధుడు ఓ నవ యువ జంటకు స్టిల్స్ చెప్పాడు.

Viral Video: ముసలోడేకానీ మహానుభావుడు.. ప్రీ వెడ్డింగ్ షూట్ డైరెక్టర్‌గా ఆంధ్ర తాత..

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లిలకు ముందు ప్రీ వెడ్డింగ్ షూట్‌లు(Pre wedding shoots) జరుపుకోవడం ఇప్పుడు ట్రెండింగ్‌. వినూత్న వెడ్డింగ్ షూట్‌లు జీవితాంతం మధుర జ్ఞాపకంగా మిగిలిపోతాయి. అందుకే ప్రి వెడ్డింగ్ షూట్‌లకు ఎంత ఖర్చైనా పెట్టడానికి సిద్ధమవుతున్నారు కుర్రకారు.

అయితే వెడ్డింగ్ షూట్‌లో వధూవరులకు స్టిల్స్ చెప్పడం మాత్రం కెమెరామెన్, వీడియోగ్రాఫర్ పనే. కానీ ఓ చోట వృద్ధుడు ఓ నవ యువ జంటకు స్టిల్స్ చెప్పాడు. సదరు వీడియో నెట్టింట వైరల్‌గా(Viral Video) మారింది. ఏపీలోని(Andhra Pradesh) ఓ జంట బోట్‌లో ఫొటో షూట్ జరుపుకుంటున్నారు.


బోట్‌ని నడుపుతున్న వృద్ధుడు వారికి స్టిల్స్ చెప్పడం.. అతను చెప్పిన విధంగా ప్రేమికులు చేయడం వీడియోలో కనిపిస్తోంది. సదరు వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

లక్షకుపైగా వ్యూస్ పొందిన ఈ వీడియోపై సరదాగా స్పందిస్తున్నారు. ముసలోడే కానీ మహానుభావుడు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

For Latest News and National News click here

Updated Date - May 31 , 2024 | 02:14 PM