Share News

బంతితో భలేగా...

ABN , Publish Date - Oct 06 , 2024 | 06:58 AM

ఎక్సర్‌సైజ్‌ బాల్‌... ఫిట్‌నెస్‌ కోసం సరిగా వినియోగించుకుంటే ఈ బంతి ఓ ఫిజియో థెరపిస్టును మరిపిస్తుంది. ఓ కోచ్‌లా సహాయపడుతుంది. ప్రస్తుతం నగరాల్లో అనేక పేర్లతో కసరత్తులు చేయిస్తోంది.

బంతితో భలేగా...

ఎక్సర్‌సైజ్‌ బాల్‌... ఫిట్‌నెస్‌ కోసం సరిగా వినియోగించుకుంటే ఈ బంతి ఓ ఫిజియో థెరపిస్టును మరిపిస్తుంది. ఓ కోచ్‌లా సహాయపడుతుంది. ప్రస్తుతం నగరాల్లో అనేక పేర్లతో కసరత్తులు చేయిస్తోంది.

క్రీడాకారులకు కూడా వీటిపై శిక్షణ ఇస్తున్నారు. ఆయా క్రీడల్లో బ్యాలెన్స్‌, కోఆర్డినేషన్‌, పోశ్చర్‌, చురుకుదనాన్ని పెంచేందుకు ఈ బంతితో వ్యాయామం తోడ్పడుతుంది.


మిగతా జిమ్‌ పరికరాలతో పోలిస్తే ఎక్సర్‌సైజ్‌ బంతి ఖరీదు చాలా తక్కువ. ఎక్కడైనా, ఎప్పుడైనా దీనితో సులభంగా కసరత్తులు చేయొచ్చు.

బంతి మీద కూర్చోవడం వల్ల కూడా కండరాల పటుత్వం పెరుగుతుంది. తగిన పోశ్చర్‌ అలవడుతుంది. బంతి మీద కూర్చునప్పుడు పొత్తికడుపు, వెన్ను కండరాలను వినియోగిస్తాం. కిందపడకుండా స్థిరంగా కూర్చుంటాం కావునే ‘స్టెబిలిటీ బాల్‌’ అన్నారు.


ఎక్సర్‌సైజు బాల్‌ వినియోగం మొదట్లో కాస్త తికమకగా అనిపిస్తుంది. అయితే క్రమంగా అలవాటవుతుంది. బంతి మీద కూర్చున్నప్పుడు పాదాలను నేల మీద పూర్తిగా ఆనించాలి. శరీరాన్ని నిటారుగా ఉంచాలి.

అన్నిరకాల ఎక్సర్‌సైజు రొటీన్లలో దీన్ని వినియోగించుకోవచ్చు. వ్యాయామ నిపుణులు ఎక్కువగా వెన్నునొప్పికి, చేతులు, కాళ్లలో కండరాల నొప్పికి బాల్‌ ఎక్సర్‌సైజులను సూచిస్తారు.


mag2.2.jpg

కార్డియో వర్కవుట్స్‌లో ఎక్సర్‌సైజ్‌ బంతిని ఉపయోగించడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. వీటిపై క్యాలరీలను తగ్గించే కసరత్తులు కూడా చేయొచ్చు. అయితే ప్రారంభంలో మాత్రం నిపుణుల పర్యవేక్షణలో చేయడం సురక్షితం.

స్టెబిలిటీ బాల్‌, ఫిజియో బాల్‌, థెరపీ బాల్‌, స్విస్‌ బాల్‌... ఇలా పేరు ఏదైనా ఎక్సర్‌సైజ్‌ చేసేవారికి ఇష్టంగా మారిందీ బంతి.

సాధారణంగా బెంచీ మీద కూర్చుని చేసే ఎక్సర్‌సైజులన్నీ దీని మీద చేయొచ్చు. వార్మప్‌లు చేయడానికి బాగుంటుంది. శరీరంలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.

Updated Date - Oct 06 , 2024 | 06:58 AM