Viral: మృతదేహం నుంచి వీర్యకణాల సేకరణ! భర్త పోయాక 15 నెలలకు బిడ్డను కన్న మహిళ
ABN , Publish Date - Jun 06 , 2024 | 03:30 PM
భర్త పోయిన 15 నెలలకు ఓ మహిళ తల్లి అయ్యింది. అతడి మృతదేహం నుంచి సేకరించిన వీర్యకణాలతో ఆమె గర్భం దాల్చి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆస్ట్రేలియాలో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: భర్త పోయిన 15 నెలలకు ఓ మహిళ తల్లి అయ్యింది. అతడి మృతదేహం నుంచి సేకరించిన వీర్యకణాలతో ఆమె గర్భం దాల్చి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తన జీవితంలో అనూహ్య మలుపులను ఇటీవలే ఆమె ఓ రేడియో కార్యక్రమంలో శ్రోతలతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఉదంతం ట్రెండింగ్ లో (Viral)) కొనసాగుతోంది.
ఆస్ట్రేలియాకు చెందిన 31 ఏళ్ల మహిళ ఎల్లిడీ జీవితం 2020లో అనూహ్య మలుపు తిరిగింది. అప్పటిదాకా ఆమె తన జీవిత భాగస్వామి ఎలెక్స్‌తో సంతోషంగా ఉండేది. ఓ రోజు అలెక్స్ సముద్రంలో చేపలు పట్టేందుకు వేళ్లాడు. అతడు గతంలో ఒలింపిక్స్ క్రీడల్లో కూడా పాల్గొన్నాడు. మరోవైపు, ఎల్లిడీ మాత్రం తమ ఇంట్లోనే ఉండిపోయింది. ఆ రోజు సాయంత్రం ఎల్లడీ ఫేస్ బుక్ చూస్తుండగా తమ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతం దేహం కనిపించిందన్న పోస్టు చూసింది. వెళ్లి ఆరా తీయగా అది ఎలెక్స్‌ది అని తెలిసి ఆమె ఒక్కసారిగా కుప్పకూలింది (Australian Woman Gives Birth To Deceased Husbands Baby Via Postmortem Sperm Retrieval).
Viral: సీఏ చదివిన యువకుడు.. బ్రేకప్ తరువాత గర్ల్‌ఫ్రెండ్‌కు భారీ షాకిచ్చాడుగా!
అప్పటికే ఎలెక్స్, ఎల్లిడీ పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంతలో అలెక్స్ దూరం కావడం ఆమె తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో ఎల్లిడీ మిత్రులు ఆమెకు పోస్ట్‌పార్టమ్ సెర్మ్ కలెక్షణ్ గురించి చెప్పారు. ఈ విధానంలో మృతదేహం నుంచి వీర్యకణాలను సేకరించి కృత్రిమ పద్ధతుల్లో గర్భం వచ్చేలా చేస్తారు. ఎల్లిడీ దీనికి అంగీకరించింది. ఆరు నెలల తరువాత వైద్యులు ఆమెకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ప్రారంభించారు. ఆ తరువాత ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారిలోనే అలెక్స్ చూసుకుంటున్నానని చెప్పింది.