Viral: భారతీయ పురుషులతో డేటింగ్! ఆస్ట్రేలియా యువతి కామెంట్స్ వైరల్!
ABN , Publish Date - Oct 14 , 2024 | 05:13 PM
భారతీయ పురుషులతో డేటింగ్‌పై ఓ ఆస్ట్రేలియా యువతి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. అనేక మంది ఆమె అభిప్రాయంతో ఏకీభవించారు.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ పురుషులతో డేటింగ్‌పై ఓ ఆస్ట్రేలియా యువతి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారాయి. బ్రీ స్టీల్ అనే యువతి పాడ్‌కాస్ట్ ప్రొడ్యూసర్. గతేడాది ఆమె భారత్‌లో విస్తృతంగా పర్యటించింది. ఇందుకు సంబంధించిన పలు వీడియోలను కూడా నెట్టింట పంచుకుంది, ఇవి సహజంగానే నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే, తాజాగా ఆమె పోస్టు చేసిన ఓ వీడియో వైరల్ అవడంతో పాటు నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది. భారతీయ పురుషులతో డేటింగ్ ఎలా ఉంటుందో చెబుతూ ఆమె ఈ వీడియో చేసింది. ఆస్ట్రేలియా అబ్బాయిల తీరుతెన్నులను కూడా చెప్పుకొచ్చింది. రెండు సంస్కృతుల మధ్య స్పష్టమైన తేడా ఉందని చెప్పింది.
Viral: రూ.23 లక్షల శాలరీ వద్దంటూ.. రూ.18 లక్షల ప్యాకేజీవైపు మొగ్గు!
‘‘ఆస్ట్రేలియాలో అబ్బాయిలు అమ్మాయిలను టీజ్ చేస్తున్నట్టు మాటలు మొదలుపెడతారు. ఇది ఒక్కోసారి చిరాకు తెప్పిస్తుంది. కానీ ఇండియాలో అంతా మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తారు. కానీ ఇక్కడ విషయం చాలా స్పీడుగా ముందుకెళుతుంది. నేను ఇటీవల ఓ పార్టీకి వెళ్లా.. అక్కడ ఓ అబ్బాయి నాపై ఇష్టత ప్రదర్శించాడు. డైరెక్ట్‌గా నా చేయిపట్టుకుని సంభాషణ ప్రారంభించాడు. ఆస్ట్రేలియాలో అసలు ఇలా జరగనే జరగదు’’ అని ఆమె చెప్పుకొచ్చింది. తానో డేటింగ్ ఈవెంట్‌కు వెళ్లినట్టు మరో వీడియోలో ఆమె చెప్పింది. అక్కడ మహిళలు, పురుషులు వేర్వేరుగా గడిపారని, ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదని, ఇది చాలా వింతగా అనిపించిందని ఆమె చెప్పుకొచ్చింది.
Viral: 15 ఏళ్లుగా లాటరీ టిక్కెట్ల కొనుగోలు! ఎట్టకేలకు అదృష్టం కలిసొచ్చి..
ఇదంతా చూశాక తనకు భారత్‌లో డేటింగ్ సంస్కృతిపై సినిమాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు అనిపించిందని తెలిపింది. ‘‘వీళ్లంతా సినిమాల్లో చూసినట్టు నిజజీవితంలో ప్రవర్తిస్తున్నారని అనిపించింది. నాకు తెలిసి ఈ తరంలోనే భారతీయులకు డేటింగ్ సంస్కృతి పరిచయం అయ్యిందనుకుంట. కానీ పాశ్చాత్య ప్రపంచంలో కొన్ని తరాలుగా డేటింగ్ ఉంది. దీనికి తోడు స్కూల్ స్థాయిలోనే విద్యార్థులకు లైంగిక విద్యను భాగం చేస్తారు. కానీ ఇండియాలో పరిస్థితి భిన్నమైనది. కాబట్టి, సినిమాల్లో చూసిందే నిజజీవితానికి అన్వయించుకుంటున్నారు. బహుశా ఇదే ఇక్కడి డేటింగ్ సంస్కృతిని ఆస్తికరంగా మార్చిందేమో’’ అని ఆమె చెప్పుకొచ్చింది. ఆమె అభిప్రాయంతో అనేక మంది ఏకీభవించారు. తమ అభిప్రాయాలను కూడా షేర్ చేశారు. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.