Viral: డాక్టర్ దారుణం! 13 ఏళ్ల కూతురితో పేషెంట్‌కు మెదడు ఆపరేషన్! ఇప్పుడేమో..
ABN , Publish Date - Nov 18 , 2024 | 09:24 PM
పదమూడేళ్ల కూతురు ముచ్చట పడిందని ఆమెతో పేషెంట్‌కు ఆపరేషన్ చేయించిందో డాక్టర్. విషయం బయటకు పొక్కడతో ఆసుపత్రి యాజమాన్యం ఆమెను తొలగిస్తే ఆ డాక్టర్ తాజాగా కోర్టును ఆశ్రయించింది.
ఇంటర్నెట్ డెస్క్: పదమూడేళ్ల కూతురు ముచ్చట పడిందని ఆమెతో పేషెంట్‌కు ఆపరేషన్ చేయించిందో డాక్టర్. విషయం బయటకు పొక్కడతో ఆసుపత్రి యాజమాన్యం ఆమెను తొలగిస్తే ఆ డాక్టర్ తాజాగా కోర్టును ఆశ్రయించింది. ఆసుపత్రి యాజమాన్యం నిబంధనల మేరకు నడుచుకోలేదంటూ వింత వాదన మొదలెట్టింది. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది (Viral). పూర్తి వివరాల్లోకి వెళితే..
Banana Phobia: మహిళా మంత్రికి వింత భయం! అధికారిక కార్యక్రమాల్లో అరటి పళ్లపై నిషేధం!
గ్రాజ్ ఆసుపత్రిలో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ఏడాది జనవరిలో 39 ఏళ్ల వ్యక్తి ఒకరు నెత్తి మీద భారీ చెట్టు కొమ్మ పడటంతో కపాలం ఎముకలు విరిగాయి. అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతడిని గ్రాజ్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే, ఆపరేషన్ సందర్భంగా సదరు వైద్యురాలి 13 ఏళ్ల కూతురు తాను పేషెంట్ తలలో మెడికల్ పరికరంతో చిల్లు చేస్తానని పట్టుబట్టింది. కూతురి మారాం చూసి మురిసిపోయిన ఆ డాక్టర్ పోనీలే అని కూతురిని ఆపరేషన్‌కు అనుమతించింది. అయితే, ఆపరేషన్ మాత్రం విజయవంతమైంది. ఇది జరిగిన మూడు నెలలకు నాటి ఆపరేషన్‌లో పాల్గొన్న ఎనస్థీషియాలజిస్టు ఆసుపత్రి యాజమాన్యానికి సమాచారం ఇచ్చాడు. దీంతో, వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించి, బాధ్యులైన వైద్యురాలిని డిస్మిస్ చేశారు.
Viral: ఒకటో తరగతి ఫీజు రూ.4.27 లక్షలు.. బాలిక తండ్రి గగ్గోలు
కాగా, పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న పేషెంట్ నోరెళ్లబెట్టాడు. తనకూ ఓ పదేళ్ల కూతురు ఉందని, ఆపరేషన్ సందర్భంగా తనకేమైనా అయ్యుంటే బాధ్యత ఎవరిదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే సదరు డాక్టర్ ప్రస్తుతం ఆసుపత్రి పైనే కేసు వేశారు. నిబంధనలకు విరుద్ధంగా తనను తొలగించారని ఆరోపించారు. కూతురితో ఆపరేషన్ చేయించిన విషయం తాను చెప్పిన వెంటనే సస్పెండ్ చేసిన వారు ఆ తరువాత మూడు నెలలకు మరో డాక్టర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా డిస్మెస్ చేశారని చెప్పారు. తను ఆపరేషన్ విషయం చెప్పగానే డిస్మిస్ చేయకపోవడం నిబంధనలకు విరుద్ధమన్న ఆమె మళ్లీ విధుల్లో నియమించుకోవాలని వాదించారు. ఆ తరువాత ఆసుపత్రితో రాజీ గురించి ఆలోచిస్తానని స్పష్టం చేశారు. కాగా, ఇతర వైద్యుల వాంగ్మూలం విన్నాక తుది నిర్ణయానికి వస్తామన్న న్యాయమూర్తి కోర్టును వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేశారు. దీంతో, ఈ ఉదంతం మరోసారి కలకలం రేపుతోంది.
Viral: ఈ సింహం ఓవర్ కాన్ఫిడెన్స్ చూడండి.. తృటిలో తప్పిన చావు!