Viral Video: ఈ ఆటో డ్రైవర్లకు సలాం కొట్టాల్సిందే.. ఈ హైదరాబాదీ ట్రిక్‌ను మనమూ నేర్చుకోవాలంటున్న ఢిల్లీ వాసులు!
ABN , Publish Date - May 22 , 2024 | 11:47 AM
విపరీతంగా పెరిగిపోతున్న ఎండలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఉత్తరాదిన చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటేస్తున్నాయి. దీంతో చాలా మంది పగటిపూట బయటకు రావడం తగ్గించేసుకున్నారు.
విపరీతంగా పెరిగిపోతున్న ఎండలు (Summer) దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఉత్తరాదిన చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటేస్తున్నాయి (Heat Waves). దీంతో చాలా మంది పగటిపూట బయటకు రావడం తగ్గించేసుకున్నారు. మరికొన్ని రోజుల పాటు వేడిగాలులు ఇదే స్థాయిలో ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని నజాఫ్‌గఢ్‌లో 47.8 డిగ్రీల సెల్సియస్ రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది (Viral Video).
ఇంత వేడిలో కూడా శ్రామిక జనాలు బయటకు వచ్చి పని చేసుకోవాల్సిందే. ఎండలో చెమటలు చిందించి పని చేయాల్సిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలోని ఓ ఆటో డ్రైవర్లు వైరైటీ ట్రిక్‌లతో తమ ఆటోల్లో చల్లదనం ఏర్పాటు చేశాడు. ఓ ఆటో డ్రైవర్ తన ఆటోకు కూలర్ తగిలించాడు. మరో ఆటో డ్రైవర్ బయటి నుంచి వేడి లోపలికి రాకుండా టాప్ మీద జనపనార, గడ్డిని ఉంచాడు. హైదరాబాద్ వీధుల్లో తిరుగుతున్న ఆ ఆటోలకు సంబంధించిన వీడియో thisisgurugram అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ అయింది.
ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఈ హైదరాబాదీల నుంచి ఢిల్లీ ఆటో వాలాలు నేర్చుకోవాలని కామెంట్ చేస్తూ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఎంత వేడి ఉన్నా ముంబై డ్రైవర్లు తమ ఆటోలో డిస్కో లైట్లు, మ్యూజిక్ ప్లేయర్లనే పెడతారు``, ``ఇలా చట్టవిరుద్ధంగా మారిస్తే ఢిల్లీ పోలీసులు ఫైన్ వేస్తారంటూ`` నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ముళ్ల పందిని పట్టుకోబోయి గాయపడిన చిరుత.. తర్వాతేం జరిగిందో చూస్తే షాకవ్వాల్సిందే..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..