Share News

Ayodhya Ramayya: ప్రాణప్రతిష్ట రోజున అయోధ్య రామయ్య వైభోగం.. ఆ 84సెకెన్లలోనే అపూర్వఘట్టం!

ABN , Publish Date - Jan 01 , 2024 | 11:14 AM

ఆదిపురుషుడు, ఏకపత్నీ వ్రతుడు, కౌసల్యా తనయుడు అయిన శ్రీరామచంద్రుని జన్మభూమి అయోధ్యలో రామమందిర నిర్మాణం అత్యద్బుతంగా జరిగింది. ఈ రామమందిరంలో రామయ్య ప్రాణప్రతిష్ట కొత్త ఏడాదిలో జనవరి 22వ తేదీన ఘనంగా జరగబోతోంది. ఈ సందర్బంగా శ్రీరామచంద్రునికి సమర్పించే నైవేద్యాలు, అక్కడి వైభోగాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

Ayodhya Ramayya: ప్రాణప్రతిష్ట  రోజున అయోధ్య రామయ్య వైభోగం.. ఆ 84సెకెన్లలోనే  అపూర్వఘట్టం!

ఆదిపురుషుడు, ఏకపత్నీ వ్రతుడు, కౌసల్యా తనయుడు అయిన శ్రీరామచంద్రుని జన్మభూమి అయోధ్యలో రామమందిర నిర్మాణం అత్యద్బుతంగా జరిగింది. ఈ రామమందిరంలో రామయ్య ప్రాణప్రతిష్ట కొత్త ఏడాదిలో జనవరి 22వ తేదీన ఘనంగా జరగబోతోంది. ఈ సందర్బంగా శ్రీరామచంద్రునికి సమర్పించే నైవేద్యాలు, అక్కడి వైభోగాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా శ్రీరామచంద్రుని ప్రాణప్రతిష్ట జరిగే ముహూర్త సమయం గురించి సర్వత్రా చర్చ నెలకొంది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

రామమందిరంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట రోజున రాముని మాతృమూర్తి కౌసల్యాదేవి పుట్టింటి ప్రాంతమైన ఛత్తీస్ గర్ నుండి 3వేల క్వింటాళ్ల బియ్యం అయోధ్యకు చేరనున్నాయి.

రామునికి సమర్పించే పవిత్ర మాలా ఉత్సవం కోసం బనారస్ నుండి తమలపాలకులను తీసుకురానున్నారు.

ఇది కూడా చదవండి: తల్లిదండ్రులు తమ పిల్లల గురించి టీచర్లను తప్పక అడగాల్సిన ప్రశ్నలివి..!


ప్రాణప్రతిష్ట సమయంలో శ్రీరాముని అత్తింటి వారు, సీతాదేవి పుట్టిన నగరమైన జనక్ పూర్ నుండి డ్రైప్రూట్స్ తో పాటు పండ్లు, బట్టలు పంపుతారు. ఈ డ్రై ఫ్రూట్స్ ను 1100 ప్లేట్లలో కానుకగా సర్థి పంపుతారు. అలాగే 51రకాల స్వీట్లు, వెన్న, పెరుగు కూడా అత్తింటి కానుకగా రామయ్యకు అందుతాయి.

అయోధ్య రామాలయంలో ఈ నైవేద్యాలు మాత్రమే కాకుండా ఎనిమిది లోహాలతో తయారుచేసిన పెద్ద గంటను ఏర్పాటు చేయనున్నారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద గంటగా నిలుస్తుందని అంటున్నారు.

రామమందిర ప్రారంభంలో ఉపయోగించబోతున్న అగరొత్తులు కూడా విశేషంగా ఉండబోతున్నాయి. 108అడుగుల పొడవుతో తయారుచేసిన అగరొత్తులను వెలిగించనున్నారు. వీటి తయారీకి ధూపం తయారీకి ఉపయోగించే కర్ర, పంచగవ్య, హవన పదార్థం, ఆవుపేడ మొదలైనవి ఉపయోగించారు.

ఇక దేశమంతా చర్చనీయాంశంగా మారిన 84సెకెన్లలోనే శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరగబోతోంది. దేశవ్యాప్తంగా 5ముహూర్తాలు ప్రతిపాదించగా వాటిలో జనవరి 22న ఉన్న ముహూర్తాన్ని ఖాయం చేశారు. జనవరి 22న మద్యాహ్నం 12:29 సెకెన్ల నుండి 12:30 సెకెన్ల వరకు ఈ ముహూర్తం సాగుతుంది. ఈ 84సెకెన్ల కాలంలోనే రామయ్య విగ్రహంలో ఆయన శక్తి నింపుతారు.

ఇది కూడా చదవండి: పరగడుపునే మెంతులు నానబెట్టిన నీళ్లు తాగితే.. ఏం జరుగుతుందంటే..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 01 , 2024 | 11:26 AM