Share News

Viral Video: తల్లి కోసం పరుగులు పెట్టిన ఏనుగు.. కనిపించగానే ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్!

ABN , Publish Date - May 03 , 2024 | 04:40 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజూ కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.

Viral Video: తల్లి కోసం పరుగులు పెట్టిన ఏనుగు.. కనిపించగానే ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్!
Elephants

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజూ కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఏనుగులకు (Elephants) సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్ హల్‌చల్ చేస్తోంది. కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్‌లో వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఫిలిప్ ఈ వీడియోను చిత్రీకరించారు. sightingsbyphil అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియో (Elephants Video)లో ఒక పిల్ల ఏనుగు తన తల్లిని వెతుకుతూ గడ్డి మైదానంలో తిరుగుతోంది. ఆ మైదానంలో ఒక చోట ఏనుగుల మంద ఉంది. ఆ మంద నుంచి తప్పించుకున్న పిల్ల ఏనుగు (Baby Elephant) తల్లి కోసం అన్వేషణ సాగించింది. చివరకు తన తల్లిని కనుగొన్న పిల్ల ఏనుగు పరుగు ప్రారంభించింది. మందలో ఉన్న ఏనుగులను తప్పించుకుని తన తల్లి దగ్గరకు వెళ్లింది. తల్లి, బిడ్డ ఒకరినొకరు ప్రేమగా దగ్గరకు చేరారు. ఈ క్యూట్ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. 42 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు.


ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఈ వీడియోను వెయ్యి సార్లకు పైగా వీక్షించాను``, ``క్యూట్‌నెస్ ఓవర్‌లోడ్! మేనం వాటిని రక్షించాలి``, ``అతను తన తల్లిని వెతకడానికి ఎంత వేగంగా పరిగెడుతున్నాడో ``, ``తన తల్లి వాసన ఆమెకు తెలుసు``, ``వాళ్లని వేరే చేయడం ఎవరికీ సాధ్యం కాదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఆహా.. దర్జా అంటే ఇదే.. గేదెల కోసం ప్రత్యేకంగా ఏసీ రూమ్.. వైరల్ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!


Viral Video: ఫ్రిడ్జ్, కూలర్‌తో వెరైటీ ఏసీ తయారు చేసిన వ్యక్తి.. నెటిజన్లు ఎందుకు తిడుతున్నారంటే..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 03 , 2024 | 04:40 PM