Share News

Viral: ఇంత జరిగినా గొరిల్లా మనల్ని నమ్ముతోంది! మనుషుల్లో మార్పెప్పుడొస్తుందో!

ABN , Publish Date - Jun 30 , 2024 | 04:08 PM

మనుషుల దాడి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన ఓ చిన్న గోరిల్లాను కొందరు రక్షించారు. వారి సంరక్షణలో మనుషులను ఇప్పుడిప్పుడే మళ్లి నమ్ముతున్న బుజ్జి గొరిల్లా వీడియో నెటిజన్లతో కంటతడి పెట్టిస్తోంది.

Viral: ఇంత జరిగినా గొరిల్లా మనల్ని నమ్ముతోంది! మనుషుల్లో మార్పెప్పుడొస్తుందో!

ఇంటర్నెట్ డెస్క్: మనుషులు భిన్న రకాలు. కొందరు మానవత్వం మూర్తిభవించినట్టు ఉంటే మరికొందరు రాక్షసులకు ప్రతిరూపంగా ఉంటారు. ఇలాంటి వాళ్లు జంతువులపై చూపే క్రౌర్యం అంతా ఇంతా కాదు. అలాంటి రాక్షసుల పాల పడి తన కుటుంబాన్ని పోగొట్టుకున్న ఓ చిన్నారి గొరిల్లా ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతోంది. చిన్నతనంలో మనుషుల్లోని దానవత్వాన్ని అనుభవించిన గొరిల్లా ఇక మనుషుల్ని ఎప్పటికైనా నమ్మగలదా అన్న తరుణంలో అది మళ్లీ జనాలకు మచ్చిక కావడం జనాలతో కంటతడి పెట్టిస్తోంది. సాటి మానవులు చేస్తున్న తప్పిదాలకు తాము సిగ్గు పడుతున్నామంటూ జనాలు పశ్చాత్తాపపడేలా చేస్తోంది.

Viral: రోజుకు12 గంటలు పనిలోనే గడిపేస్తున్నా! మహిళ పోస్టుకు భారీ స్పందన


డా ఖ్లోయీ బ్యూటింగ్ అనే వెటర్నరీ డాక్టర్ ఈ వీడియోను షేర్ చేశారు. వీడియోలోని చిన్న గొరిల్లా తల్లిదండ్రులను కొందరు వేట గాళ్లు మాంసం కోసం పెట్టనపెట్టుకున్నారని చెప్పారు. నాలుగు నెలల వయసే ఉన్న చిన్న గొరిల్లా బంధించి కొంత కాలానికి అమ్మేద్దామని ప్లాన్ చేశారని చెప్పారు. అయితే, అదృష్టవశాత్తూ దాన్ని కొందరు రక్షించి జంతు సంరక్షణ శాలకు తరలించారని వివరించారు. ఓ మహిళ ఇప్పుడు గొరిల్లా బాగోగులు చూసుకుంటోందని అన్నారు. తొలుత మనుషుల దగ్గరకు వచ్చేందుకు భయపడే చిన్నారి గొరిల్లా ఇప్పుడిప్పుడే తన సంరక్షకురాలికి మచ్చికైందని తెలిపారు. ఈ చిట్టి జీవి దీనస్థితి చూస్తుంటే గుండె తరక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గొరిల్లా విశ్వాసానికి మనుషులు నిజంగా అర్హులేనా అని వాపోయారు.

వీడియోపై నెట్టింట పెద్ద స్పందన వస్తోంది. మనుషుల్లోని భిన్న పార్శ్వాలు భయంగొలుపుతున్నాయని అనేక మంది కామెంట్ చేశారు. మనుషులవలెనే గొరిల్లాలు కూడా భావోద్వేగాలకు లోనవుతాయని, తల్లిదండ్రులు తోడబుట్టిన వారికి దూరమైనప్పుడు తీవ్ర ఆవేదన చెందుతాయని చెప్పుకొచ్చాడు. ఈ జీవాల రక్షణ కోసం మరింత చేయాల్సి ఉందని అనేక మంది అభిప్రాయపడ్డారు.

Read Viral and Telugu News

Updated Date - Jun 30 , 2024 | 04:08 PM