Viral Video: జస్ట్ మిస్.. ఫైర్ కటింగ్ ప్రాణాలు తీసేసేదే.. అగ్గిపుల్ల వెలిగించిన వెంటనే ఏం జరిగిందో చూడండి..!
ABN , Publish Date - Jun 21 , 2024 | 04:18 PM
ఫ్యాషన్ ప్రపంచంలో రోజుకో కొత్త స్టైల్ పుట్టుకొస్తుంటుంది. హెయిర్ స్టైల్ విషయంలో అయితే రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. సినిమా హీరోలను ఫాలో అవుతుంటారు. కస్టమర్ల కోసం హెయిర్ స్టైలిష్ట్‌లు రకరకాల టెక్నిక్‌లను ముందుకు వస్తుంటారు. ఇటీవలి కాలంలో ఫైర్ కటింగ్ చాలా క్రేజ్ దక్కించుకుంది.
ఫ్యాషన్ (Fashion) ప్రపంచంలో రోజుకో కొత్త స్టైల్ పుట్టుకొస్తుంటుంది. హెయిర్ స్టైల్ (Hair Style) విషయంలో అయితే రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. సినిమా హీరోలను ఫాలో అవుతుంటారు. కస్టమర్ల కోసం హెయిర్ స్టైలిష్ట్‌లు రకరకాల టెక్నిక్‌లను ముందుకు వస్తుంటారు. ఇటీవలి కాలంలో ఫైర్ కటింగ్ (Fire Cutting) చాలా క్రేజ్ దక్కించుకుంది. అంటే జుట్టును కాల్చడం. ఈ ఫైర్ కటింగ్ చేయడానికి కాసింత శిక్షణ అవసరం. కానీ, కొందరు ఎలాంటి శిక్షణా లేకుండానే కటింగ్ చేసేస్తున్నారు. అలా చేస్తే ఏమవుతుందో చూపించే భయంకర వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
@veejuparmar అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి సెలూన్‌లోని కుర్చీలో కూర్చున్నాడు. అతడి జుట్టుకు ఏదో ఆయిల్ ఉంది. అంతలో స్టైలిష్ట్ వచ్చి అగి పుల్ల వెలిగించి కస్టమర్ జుట్టుపై వేశాడు. దీంతో ఒక్కసారిగా మంటలు (Fire on Head) చెలరేగాయి. ఆ మంటలు కిందకు కూడా వ్యాపించబోయాయి. వెంటనే కస్టమర్ భయంతో కేకలు వేస్తూ తనపై ఉన్న తువ్వాలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఇద్దరు స్టైలిష్ట్‌లు కూడా అతడికి సహాయం చేయడంతో మంటల నుంచి ఆ వ్యక్తి బయటపడ్డాడు.
ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 9 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. ``ఇది ఘోస్ట్ రైడర్ కటింగ్``, ``జుట్టు మీద ఇలాంటి ప్రయోగాలు ఎందుకు చేస్తారు``, ``స్టైలిష్ట్ అన్ ఫైర్``, ``కొంచెం ఉంటే మొత్తం కటింగ్ అయిపోయేది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వామ్మో.. ఎవర్రా మీరంతా.. ప్రాణాలంటే లెక్క లేదా? రీల్ కోసం ఓ అమ్మాయి ఏం చేసిందో చూడండి..
Optical Illusion: గడ్డిలో దాక్కున్న పామును కనిపెట్టగలిగితే మీ దృష్టి అద్భుతంగా ఉన్నట్టు లెక్క..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..