Viral: ఉచితంగా జ్ఞానం పంచుతున్న ఆటో డ్రైవర్! ఎలాగో తెలిస్తే..
ABN , Publish Date - Nov 29 , 2024 | 10:19 PM
బెంగళూరు జనాల రేంజ్ ఇది అని అనిపించే మరో ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అక్కడి ఆటో డ్రైవర్ తన ఆటోలో ఏకంగా మినీ లైబ్రెరీ ఏర్పాటు చేయడమేకాకుండా కావాల్సిన వారికి ఉచితంగా పుస్తకాలు కూడా ఇచ్చేస్తున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరు జనాల రేంజ్ ఇది అని అనిపించే మరో ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అక్కడి ఆటో డ్రైవర్ తన ఆటోలో ఏకంగా మినీ లైబ్రెరీ ఏర్పాటు చేయడమేకాకుండా కావాల్సిన వారికి ఉచితంగా పుస్తకాలు కూడా ఇచ్చేస్తున్నాడు. అదే ఆటోలో ప్రయాణించిన ఓ వ్యక్తి ఈ విషయాన్ని ఫొటో తీయగా ఉదంతం నెట్టింట కాలుపెట్టి తెగ వైరల్ అవుతోంది (Viral).
Viral: 100 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉండే చీర.. నీతా అంబానీ ఫేవరెట్!
ఆర్ లోకేశ్ అనే వ్యక్తి లింక్డ్‌ఇన్‌లో ఈ ఉదంతాన్ని పోస్టు చేశారు. తన స్నేహితుడికి ఆటోలో వెళుతుండగా ఈ అద్భుత దృశ్యం కనిపించిందని తెలిపాడు. ఆటోలోని మినీ లైబ్రెరీ చిత్రాన్ని కూడా పంచుకున్నారు. బెంగళూరు స్టైల్ అంటూ షేర్ చేసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.
ఒక్కో రకం పుస్తకాలకు ఒక్కో అర ఏర్పాటు చేశారని ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు. డ్రైవర్ తన సీటు వెనకాల ఈ పుస్తకాలను చిన్న చిన్న అరల్లో పేర్చినట్టు తెలిపాడు. తత్వ శాస్త్రానికి చెందిన పుస్తకాలు మొదలు ఆధ్యాత్మికం, ప్రేమ ఇలా రకరకాల అంశాలకు సంబంధించిన పుస్తకాలు ఆటోలో ఉన్నట్టు చెప్పుకొచ్చాడు.
Viral: శ్వేతజాతీయురాలిని పెళ్లాడితే డైవర్స్ తప్పదన్నారు..ఎన్నారై వీడియో వైరల్
‘‘ఒక్క బెంగళూరులో మాత్రమే ఈ జ్ఞానమంతా ఉచితంగా లభిస్తుంది. ఆటోలో ప్రయాణిస్తుండగా నా స్నేహితుడికి ఇది కనిపించింది. ఇది మినీ లైబ్రెరీ ఆన్ వీల్స్. ‘వై డైవర్స్’, ‘గాడ్ లవ్స్ యూ’ మొదలు అనేక పుస్తకాలు ఉన్నాయి. ఆ ఆటోవాలా డ్రైవర్ గానే కాకుండా లైఫ్ కోచ్‌గా, కౌన్సిలర్‌గా, ఆధ్యాత్మిక గురువుగా కూడా సేవలందిస్తున్నాడు. గజిబిజి ట్రాఫిక్‌లో బండితోలుతూనే ఇలా విభిన్న బాధ్యతలను మోస్తున్నాడు. ఇంతకంటే సృజనాత్మకమైన, స్ఫూర్తిమంతమైన విషయం మరొకటి ఉండదేమో’’ అని కామెంట్ చేశాడు.
కాగా, బెంగళూరుకు చెందిన మరో ఆటోవాలా ఉదంతం కూడా ఇటీవల తెగ వైరల్ అయ్యింది. తన ఆటోలో ఎక్కిన ప్రయాణికుల నుంచి నిధుల సేకరణకు పూనుకున్నాడో ఆటో డ్రైవర్. ఇందు కోసం ఆటోలో ఓ బోర్డు కూడా ఏర్పాటు చేశాడు. తనకో స్టార్టప్ ఐడియా ఉందని, ఈ ఆలోచనకు వాస్తవ రూపం ఇచ్చేందుకు నిధులు కావాలని ఆ బోర్డు మీద రాశాడు. నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న వారు ముందుకు రావాలని కూడా అభ్యర్థించాడు. దీంతో, ఈ ఉదంతం అప్పట్లో సంచలనంగా మారింది.
Viral: ఈ ఆడ ఏనుగు కష్టం చూస్తే గుండె తరుక్కుపోతుంది! ఎంతైనా తల్లి కదా..