Share News

Viral: వామ్మో.. వీడు మామూలు దొంగ కాదు.. పావురాన్ని వాడుకుని 50 ఇళ్లలో చోరీ.. అతడి ప్లాన్ ఏంటంటే..

ABN , Publish Date - Oct 11 , 2024 | 06:28 PM

తాజాగా బెంగళూరులో ఓ దొంగ చూపించిన తెలివి చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. కేవలం ఓ పావురాన్ని ఉపయోగించుకుని ఓ వ్యక్తి ఏకంగా 50 ఇళ్లలో లూటీకి పాల్పడ్డాడు. లక్షల సంపద దోచుకున్నాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు.

Viral: వామ్మో.. వీడు మామూలు దొంగ కాదు.. పావురాన్ని వాడుకుని 50 ఇళ్లలో చోరీ.. అతడి ప్లాన్ ఏంటంటే..
Bengaluru Burglar Used Pigeons to Robbery

ప్రాచీన శాస్త్రాల ప్రకారం 24 కళల్లో చోర కళ (Theft) ఒకటి. దొంగతనం చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. పోలీసులు ఎంతో ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే.. దొంగలు మరింతగా తమ బుర్రలకు పదునుపెట్టి దొంగతనాలు చేస్తుంటారు. పోలీసులకు చిక్కకుండా రకరకాల మార్గాల్లో దొంగతనాలు చేస్తున్నారు. తాజాగా బెంగళూరు (Bengaluru)లో ఓ దొంగ చూపించిన తెలివి చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. కేవలం ఓ పావురాన్ని (Pigeon) ఉపయోగించుకుని ఆ వ్యక్తి ఏకంగా 50 ఇళ్లలో లూటీకి (Robbery) పాల్పడ్డాడు. లక్షల సంపద దోచుకున్నాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు (Crime News).


బెంగళూరు‌కు చెందిన 38 ఏళ్ల మంజునాథ్‌ అనే వ్యక్తి ఓ పావురాన్ని ఉపయోగించుకుని దొంగతనాలకు పాల్పడుతున్నాడు. నగరంలో జరిగిన దాదాపు 50 దొంగతనాల వెనకాల ఇతడి హస్తం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. విచారణలో అతడు షాకింగ్ విషయాలు వెల్లడించాడు. ఓ పావురాన్ని ఉపయోగించుకుని తానొక్కడినే ఈ దొంగతనాలన్నీ చేసినట్టు పోలీసులకు మంజునాథ్ చెప్పాడు. అతడు చెప్పిన వివరాలు ప్రకారం.. ముందుగా అతడు ఏదో ఒక అపార్ట్‌మెంట్‌ను ఎంచుకుంటాడు. ఆ అపార్ట్‌‌మెంట్ మీదకు ఓ పావురాన్ని వదలుతాడు. ఆ పావురం ఏదో ఒక ఫ్లాట్ బాల్కనీ మీద కూర్చోగానే అతడు రంగంలోకి దిగుతాడు.


తన పావురం ఎగిరి వచ్చేసిందని, వెళ్లి తీసుకుంటానని సెక్యూరిటీకి చెప్పి లోపలికి ప్రవేశిస్తాడు. ఆ అపార్ట్‌మెంట్‌లో తాళం వేసి ఉన్న ఫ్లాట్‌ కనుక ఉంటే ఓ ఇనుపరాడ్‌తో తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశిస్తాడు. ఇంట్లో ఉన్న నగలు, సొమ్ము కాజేసి దర్జాగా బయటకు వెళ్లిపోతాడు. ఇదంతా పగటిపూట, ప్రజలు తమ పనులతో బిజీగా ఉన్నప్పుడే చేసేవాడు. అలా దాదాపు 50 ఇళ్లలో చోరీకి పాల్పడ్డాడు. అతడు ఎంత తెలివిగా వ్యవహరించేవాడంటే ఎవరికీ కనీసం అనుమానం వచ్చేది కాదు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. మంజునాథ్‌పై ఇంతకు ముందు కూడా పలు కేసులు ఉన్నాయి. జైలు నుంచి బయటకు రాగానే ఏదో ఒక కొత్త టెక్నిక్‌తో మంజునాథ్ చోరీలకు పాల్పడుతుంటాడు.

ఇవి కూడా చదవండి..

Viral Video: మీ పిల్లలు బిస్కెట్లు ఎక్కువగా తింటున్నారా? ఈ వీడియో చూశాక అయినా జాగ్రత్త పడండి..


Viral Video: వామ్మో.. పాము అక్కడకు ఎలా వెళ్లింది.. క్లాస్ రూమ్‌లో పాఠాలు చెబుతున్న టీచర్ ప్యాంట్‌లో పాము..


Optical Illusion: మీ పరిశీలనా శక్తికి పరీక్ష.. ఈ ఫొటోలో దాక్కున్న కుక్కను 10 సెకెన్లలో పట్టుకోండి..


Ratan Tata: రతన్ టాటా‌ సమస్య ఏంటి? కీలక అవయవాలను డ్యామేజ్ చేసిన ఆ వ్యాధి లక్షణాలేంటి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 11 , 2024 | 06:30 PM