Viral Video: మీ పిల్లలు బిస్కెట్లు ఎక్కువగా తింటున్నారా? ఈ వీడియో చూశాక అయినా జాగ్రత్త పడండి..
ABN , Publish Date - Oct 11 , 2024 | 05:44 PM
ఆ వ్యక్తి తన పిల్లల కోసం క్రిమ్ బిస్కెట్ ప్యాకెట్ కొని తీసుకొచ్చాడు. ఆ ప్యాకెట్‌లోని ఓ బిస్కెట్లో సన్నని ఇనుప తీగ కనిపించింది. ఒకవేళ ఆ బిస్కెట్‌ను చిన్నారి తినేసి ఉంటే చాలా పెద్ద ప్రమాదం సంభవించేంది. ఆ వ్యక్తి ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
మీ పిల్లలు బిస్కెట్ ప్యాకెట్లు ఎక్కువగా తింటున్నారా? అయితే జాగ్రత్త పడండి.. ఆదమరపుగా తినేస్తే చాలా పెద్ద ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉంది. తాజాగా ఓ వ్యక్తికి అలాంటి అనుభవమే ఎదురైంది. ఆ వ్యక్తి తన పిల్లల కోసం క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ (Biscuit Packet) కొని తీసుకొచ్చాడు. ఆ ప్యాకెట్‌లోని ఓ బిస్కెట్లో సన్నని ఇనుప తీగ (Iron Wire) కనిపించింది. ఒకవేళ ఆ బిస్కెట్‌ను చిన్నారి తినేసి ఉంటే చాలా పెద్ద ప్రమాదం సంభవించేంది. ఆ వ్యక్తి వెంటనే ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి స్థానిక దుకాణంలో బార్‌బౌన్ బిస్కెట్లు కొనుగోలు చేశాడు. అతని పిల్లలు బిస్కెట్లు తింటుండగా అందులో ఓ సన్నని ఇనుప తీగ వచ్చింది. దాన్ని వారు తమ తండ్రికి చూపెట్టారు. దీంతో ఆ వ్యక్తి ఆ ఘటనను రికార్డు చేశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి.. ``ఇది చాలా ఘోరంగా ఉంది. తల్లిదండ్రులందరినీ హెచ్చరించడానికి ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి, మీ పిల్లలకు స్నాక్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. లోపల ఏమి ఉందో మీకు ఎప్పటికీ తెలియదు`` అని కామెంట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. కొన్ని వేల మంది ఈ వీడియోను వీక్షించారు. వందల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ``చూసుకోకుండా తినేస్తే ఎంత ప్రమాదం``, ``సదరు కంపెనీపై వెంటనే చర్యలు తీసుకోవాలి``, ``బిస్కెట్‌లో ఇనుప తీగ ఉండడం ఏంటి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: మీ పరిశీలనా శక్తికి పరీక్ష.. ఈ ఫొటోలో దాక్కున్న కుక్కను 10 సెకెన్లలో పట్టుకోండి..
Ratan Tata: రతన్ టాటా సమస్య ఏంటి? కీలక అవయవాలను డ్యామేజ్ చేసిన ఆ వ్యాధి లక్షణాలేంటి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..