Share News

Viral: వామ్మో.. రోజుకు 18 గంటల పని! ఈ స్టార్టప్ కంపెనీ సీఈఓ కష్టం చూస్తే..

ABN , Publish Date - Sep 30 , 2024 | 07:25 AM

ఓ స్టార్టప్ సంస్థ సీఈఓ తన కొత్త సంస్థను పరిగెత్తించేందుకు రోజుకు 18 గంటలు కష్టపడుతున్న తీరు నెట్టింట కలకలం రేపుతోంది. ఇది మంచిది కాదంటూ జనాలు విమర్శలు గుప్పిస్తున్నారు.

Viral: వామ్మో.. రోజుకు 18 గంటల పని! ఈ స్టార్టప్ కంపెనీ సీఈఓ కష్టం చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో అనేక మంది యువత పని ఒత్తిడి కారణంగా అనారోగ్యం పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ స్టార్టప్ సంస్థ సీఈఓ తన కొత్త సంస్థను వృద్ధిలోకి తెచ్చేందుకు రోజుకు 18 గంటలు కష్టపడుతున్న తీరు నెట్టింట కలకలం రేపుతోంది. బెంగళూరులోని ఓ ఏఐ స్టార్టప్ సంస్థ సహ వ్యవస్థాపకుడు కష్టపడుతున్న తీరును మరో ఫౌండర్ తుషార్. ఎస్ నెట్టింట పంచుకున్నారు. ఇది ప్రస్తుతం వైరల్‌గా (Viral) మారింది.

తాము కొత్తగా ఏర్పాటు చేసిన కృత్రిమే మేధ సంస్థను వృద్ధిలోకి తెచ్చేందుకు అభినాశ్ ఖారే ఎంత కష్టపడుతున్నదీ తుషార్ లింక్డ్‌ఇన్‌లో వివరించారు. గత ఏడు నెలలుగా అభినాశ్ రోజుకు 18 గంటల పాటు కష్టపడుతున్నట్టు చెప్పారు. అచ్చు మనిషిని పోలిన గొంతుతో మాట్లాడే ఏఐని తాము అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తు్న్నట్టు చెప్పుకొచ్చారు (Bengaluru CEO shares details of co founders exhausting18 hour long workdays).

Viral: మార్స్‌పై మనిషి సెటిలైతే జరిగేది ఇదే.. అమెరికా శాస్త్రవేత్త హెచ్చరిక


ఖారే ఉదయం 8 గంటలకే పనిలోకి దిగిపోతారని తుషార్ చెప్పారు. చివరకు అర్ధరాత్రి 2 వరకూ పనిలోనే బిజీబిజీగా గడిపేస్తారని అన్నారు. చాలా సందర్భాల్లో కంప్యూటర్‌కు కొద్ది అడుగుల దూరంలోనే అభినాశ్ నిద్రపోతారని, లేచిన తరువాత వీలైనంత వెంటనే పనిలోకి దిగేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అయితే, అభినాశ్ కష్టాన్ని ఏదో గొప్పగా చూపించాలన్నది తన ఉద్దేశం కాదని తుషార్ స్పష్టం చేశారు. కొత్తగా సంస్థలు ఏర్పాటు చేసినప్పుడు, బయటి నుంచి ఆర్థిక సాయం అందనప్పుడు పరిమితులను అధిగమిస్తూ కష్టించాల్సి ఉంటుందని చెప్పారు. స్టార్టప్ కల్చర్ ఇలాగే ఉంటుందని అన్నారు. ‘‘ఆయన ప్రాధాన్యాల విషయంలో పొరపాట్లు ఉన్నాయని నాకు తెలుసు. కానీ, లైఫ్‌లో ఏదైనా సాధించాలంటే ఈ మాత్రం కష్టం తప్పదు’’ అని తుషార్ చెప్పుకొచ్చారు.

Viral: స్వీయ వివాహం చేసుకున్న ఇన్‌ఫ్లుయెన్సర్ ఆత్మహత్య!


కానీ, జనాలకు మాత్రం ఈ పోస్టు అంతగా నచ్చలేదు. దీంతో, విమర్శలు వెల్లువెత్తాయి. ‘‘ఇది ఓ విషపూరిత పని సంస్కృతి. బహిరంగంగా ఈ తీరును ప్రశంసించడంలో అర్థం లేదు. ఒక స్టార్టప్ సంస్థను వృద్ధిలోకి తీసుకురావాలంటే ఎంత కష్టమో నేను అర్థం చేసుకోగలను. కానీ ఇలా అతిగా కష్టపడి మరణాన్ని ఆహ్వానించకూడదు’’ అని ఓ వ్యక్తి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇలా అతిగా కష్టపడే బదులు, కాస్తంత రెస్టు తీసుకుని పనిలోకి దిగితే మెదడు మరింత చురుగ్గా పనిచేస్తోంది. అద్భుతాలు జరుగుతాయి. దీర్ఘకాలికంగా ఈ తీరుతో ఇబ్బందులు తప్పవు’’ అని మరో వ్యక్తి అన్నారు. ఇటీవల ఓ ప్రముఖ కార్పొరేట్ కంపెనీ యువ ఉద్యోగి పని ఒత్తిడి తట్టుకోలేక మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్పొరేట్ ప్రపంచం తీరుతెన్నులపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వామ్మో! పెళ్లికొచ్చిన అతిథుల నుంచి వధూవరులు రూ.2 లక్షలు చొప్పున వసూల్!

Read Latest and Viral News

Updated Date - Sep 30 , 2024 | 07:29 AM