Viral: జెప్టో, బ్లింకిట్ యాప్‌లకు కొబ్బరి బొండాల షాపు యజమాని ఛాలెంజ్!
ABN , Publish Date - Nov 10 , 2024 | 07:11 PM
క్విక్ కామర్స్ యాప్‌ల కంటే తన వద్ద కొబ్బరి బొండాల రేటు తక్కువగా ఉందంటూ ఓ వీధి వ్యాపారి చేసిన ఛాలెంజ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. చిరువ్యాపారులపై ఈ బడా సంస్థల ప్రభావంపై నెట్టింట చర్చకు దారి తీసింది.
ఇంటర్నె్ట్ డెస్క్: ఒకప్పుడు ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డరిస్తే రెండు మూడు రోజుల్లో ఇంటికొచ్చేవి. కానీ జెప్టో, బ్లింకిట్, బిగ్‌బాస్కెట్ వంటి క్విక్ కామర్స్ సంస్థలు ఎంట్రీ తరువాత ఆర్డరిచ్చిన వస్తువులు నిమిషాల వ్యవధిలో ఇంటికొచ్చేస్తున్నాయి. జనాలు దీనికి బాగా అలవాటు పడిపోవడంతో అనేక మంది ఇంటిపక్కనున్న కిరాణాషాపుల వైపు కూడా చూడట్లేదు. ఫలితంగా ఎన్నో షాపులు మూతపడుతున్నాయి. వాటి యజమానులు జీవనాధారం కోల్పోయి తలకిందులైపోతున్నారు. ఇక సంప్రదాయక షాపుల యజమానులు కూడా క్విక్ కామర్స్ సంస్థలకు తమదైన శైలిలో పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో బెంగళూరులోని ఓ కొబ్బరి బొండా షాపు యజమాని క్విక్ కామర్స్ సంస్థలకు చేసిన ఛాలెంజ్ ప్రస్తుతం వైరల్ (Viral) అవుతోంది.
Viral: కూతురి రూపురేఖలు చూసి తండ్రికి డౌట్! డీఎన్ఏ టెస్టు చేయిస్తే..
కొబ్బరి బొండాం ధర క్విక్ కామర్స్ సైట్‌లల్లో ఎంత ఉందో తన వద్ద ఎంత ఉందో పోల్చి చెబుతూ అతడు బోర్డు పెట్టాడు. ‘‘జెప్టోలో రూ. 80, బ్లింకిట్‌లో రూ.80, బిగ్ బాస్కెట్‌లో రూ.70... కానీ మా వద్ద మాత్రం రూ.55లే’’ అంటూ అతడు చెప్పుకొచ్చాడు. తన బతుకుతెరువు కాపాడుకునేందుకు అతడు చేసిన ఈ ప్రయత్నం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. క్విక్ కామర్స్ ప్రభావం వీధి వ్యాపారులపై కూడా పడిందా అన్న చర్చ మొదలైంది. ధరల మధ్య తేడా గురించి కూడా జనాలు పెద్ద ఎత్తున చర్చ లేవదీశారు (Viral).
Viral: వామ్మో.. జూలో జింకకు ఎంత తెలివో చూడండి!
క్విక్ కామర్స్ కారణంగా వీధి వ్యాపారుల పడుతున్న కష్టాలకు అనేక మంది చలించిపోయారు. కాలు కదపకుండా ఇంటికే పచారీ సామాన్లు వస్తుండటంతో అనేక మందికి యాప్‌ల ద్వారా ఆర్డర్లు పెట్టడం ఓ వ్యసనంగా మారిందని అన్నారు. ప్రజలు బాగా అలవాటు పడిపోయాకా ఆయా సంస్థలు వస్తువుల ధరలను బాగా పెంచేస్తాయని హెచ్చరించారు. కొందరు మాత్రం ఈ వాదనతో విభేదించారు. వీధి వ్యాపారులవద్దే రేట్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. కొన్ని ఈ కామర్స్ సంస్థ సరసమైన ధరలకే వస్తువులు ఇస్తున్నాయని, డెలివరీ చార్జీల కింద రూ. 5 మాత్రమే వసూలు చేస్తున్నాయని అన్నారు. హోం డెలివరీ కారణంగా కస్టమర్లకు వాయుకాలుష్యం, పెట్రోలు ఖర్చు కలిసొస్తున్నప్పుడు క్విక్ కామర్స్ యాప్స్‌తో నష్టమేమిటని ప్రశ్నించారు. ఇలా రకరకాలా కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
Viral: భర్తకు జాబ్ పోయిందని విడాకులిచ్చి.. 4 ఏళ్ల తరువాత ఊహించని విధంగా..