Viral: వాహనదారుడికి షాకింగ్ అనుభవం! జోరు వానలో బయటకు రావద్దనేది ఇందుకే..
ABN , Publish Date - Oct 17 , 2024 | 05:19 PM
భారీ వర్షాలు పడేటప్పుడు బయటకు రావద్దని ప్రజలకు అధికారులు సూచిస్తుంటారు. ఈ సూచన పాటించకపోతే ఏం జరుగుతుందో చెప్పే ఘటన ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: భారీ వర్షాలు పడేటప్పుడు బయటకు రావద్దని ప్రజలకు అధికారులు సూచిస్తుంటారు. ఈ సూచన పాటించకపోతే ఏం జరుగుతుందో చెప్పే ఘటన ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. వానలో ద్విచక్రవాహనంపై బయలుదేరిన తాను ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నదీ చెబుతూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టు చదవి జనాలు హడలిపోతున్నారు. వానలో బయటకు వెళ్లినందుకు చావుతప్పి కన్నులొట్టపోయినంత పనైందంటూ అతడు షేర్ చేసిన ఉదంతం ప్రస్తుతం సంచలనంగా మారింది (Viral).
Viral: తండ్రి హత్య! 25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం!
బెంగళూరులో ఇటీవల వాన కురిసిన సందర్భంలో ఎదురైన భయానక అనుభవాన్ని ఆ వ్యక్తి రెడిట్‌లో షేర్ చేసుకున్నాడు. భారీ వర్షం పడుతున్నదని తెలిసినా రిస్క్ చేసి టూ వీలర్‌పై బయటకు వచ్చినట్టు అతడు చెప్పాడు. అయితే, కొంత దూరం ప్రయాణించాక రోడ్డుపైకి భారీగా నీరు వచ్చేసిందని అన్నాడు. ఒకానొక దశలో బండి సైలెన్సర్‌లోకి నీరు చేరడంతో వాహనం ఆగిపోయిందని అన్నాడు. బండి తోసుకుంటూ స్నేహితుడి ఇంటివైపు వెళుతుండగా దారిలో ఓ కరెంటు వైరు తెగి రోడ్డుపై పడిందని చెప్పాడు. ‘‘ఆ వైరు నుంచి నిప్పు రవ్వలు ఎగసి పడుతున్నాయి. అది నాకు కేవలం 10 మీటర్ల దూరంలోనే ఉంది. రోడ్డంతా చిత్తడిగా ఉంది. నాకు కరెంటు షాక్ కొడుతుందేమో అని భయపడిపోయా. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెనక్కు తిరిగి చూడకుండా బండిని తోసుకుంటూ నా స్నేహితుడి ఇంటివైపు వెళ్లిపోయా’’ అని అతడు చెప్పాడు.
Viral: దసరా నాడు టెకీ నిర్వాకం! అమ్మవారి పూజ జరుగుతుండగా లాప్‌టాప్ తెరిచి..
అక్కడి నుంచి క్యాబ్ ఆటోలో ఇంటి వద్దామనుకుంటే అప్పుడు కూడా ఇబ్బందులు తప్పలేదని అతడు చెప్పుకొచ్చాడు. ఆటో ఇంటి ముందుకు వచ్చాక డ్రైవర్ హఠాత్తుగా రేటు పెంచేశాడని, తప్పనిసరి పరిస్థితుల్లో అతడు అడిగిన మొత్తం ఇచ్చుకున్నానని అన్నాడు. స్నేహితుడి ఇంటి ముందు వదిలిని వాహనం ఏమవుతుందో అన్న భయం కూడా వెంటాడిందని చెప్పుకొచ్చాడు. ఆ రోజు కేవలం ఆరు కిలోమీటర్లు ప్రయాణించేందుకు తాను ఏకంగా రూ.600 ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇలా తన ఇబ్బందుల్ని ఏకరవు పెట్టిన అతడు నెటిజన్లను హెచ్చరించాడు. భారీ వర్షాల్లో బయటకు రావద్దని మరీ మరీ చెప్పాడు. ఈ పోస్టుకు జనాలు పెద్ద ఎత్తున స్పందించారు. తామూ ఇలాంటి సమస్యల్లో చిక్కుకున్నామని పేర్కొన్నారు.
Viral: గ్రహాంతరవాసులు ఉన్నారు! త్వరలో శాస్త్రవేత్తల కీలక ప్రకటన!!