Share News

Google: గూగుల్‌ ఉద్యోగంలో సాధకబాధకాలు.. టెకీ పోస్టు నెట్టింట వైరల్!

ABN , Publish Date - Dec 08 , 2024 | 12:34 PM

మూడేళ్లుగా గూగుల్‌లో ఉద్యోగం చేస్తున్న ఓ టెకీ ఈ జాబ్‌లోని సాధకబాధకాలను పంచుకుంటూ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. రాజ్ విక్రమాదిత్య అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎక్స్ వేదికగా ఈ పోస్టు చేశారు.

Google: గూగుల్‌ ఉద్యోగంలో సాధకబాధకాలు.. టెకీ పోస్టు నెట్టింట వైరల్!

ఇంటర్నెట్ డెస్క్: మూడేళ్లుగా గూగుల్‌లో ఉద్యోగం చేస్తున్న ఓ టెకీ ఈ జాబ్‌లోని సాధకబాధకాలను పంచుకుంటూ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. రాజ్ విక్రమాదిత్య అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎక్స్ వేదికగా ఈ పోస్టు చేశారు. గూగుల్‌ ఉద్యోగంలో ఎన్నో ప్రోత్సాహకాలు ఉన్నాయంటూనే కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయని విశదీకరించారు (Viral).

‘‘నేటితో నేను గూగుల్‌లో మూడేళ్లు పూర్తి చేసుకున్నాను. వృత్తిగత, వ్యక్తిగత జీవితాల మధ్య అద్భుతమైన సమతౌల్యం, మంచి ఫుడ్, కసరత్తుల కోసం జిమ్, రిలాక్సయ్యేందుకు స్పా, టూర్‌లు, పార్టీలు.. అబ్బో మీ లైఫ్‌కు సంబంధించి అనేక అంశాల్లో వాళ్లే జాగ్రత్తలు తీసుకుంటారు’’ అని అతడు చెప్పుకొచ్చాడు.

Viral: 50 ఏళ్ల క్రితం డైవర్స్.. ఇన్నాళ్లకు మళ్లీ పెళ్లిచేసుకోనున్న వృద్ధ జంట!


గూగుల్ కోడ్ బేస్ కూడా అద్భుతమని కితాబునిచ్చారు. దాన్ని పరిశీలించి చూస్తే ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో అని అనిపిస్తుందని అన్నారు. ఆ నాణ్యత, స్థూల ఆర్కిటెక్చర్ అన్నీ గొప్పగా ఉంటాయని పేర్కొన్నారు.

గూగుల్‌లో జాబ్ అంటే.. మీ చుట్టూ నిత్యం అసమాన ప్రతిభావంతులు ఉంటారు. దీంతో, వారితో సమానంగా ప్రతిభ చూపించాలన్న ఒత్తిడి నిరంతరం ఉంటుంది. దీంతో, మనల్ని మనం నిత్యం మెరుగుపరుచుకునే ప్రయత్నంలో గడిపేస్తామని అన్నారు. శాలరీకి అదనంగా అనేక చెల్లింపులు ఉంటాయని వివరించారు. ఆన్ కాల్ పే, పీర్ బోనస్‌లు, స్పాట్ బోనస్‌లు..ఇలా ఏదోక రూపంలో అదనపు ఆదాయం వస్తుందని చెప్పారు.

Viral: మంచనా 85 ఏళ్ల వృద్ధుడు! పక్కనే నిలబడి 22 ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్ డ్యాన్స్!


ఈ జాబ్‌లో ఉండే సవాళ్లను కూడా అతడు పంచుకున్నాడు. గూగుల్ పెద్ద సంస్థ కావడంతో ఏదైనా ప్రాజెక్టులకు అనుమతి లభించేందుకు చాలా సమయం పడుతుందని చెప్పారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు వివిధ అంచెల్లో ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలిస్తారని వివరించారు. ఏ టీం కూడా ఓ ప్రాజెక్టుపై మొదటి నుంచి చివరి వరకూ పనిచేసే అవకాశం ఉండకపోవడంతో అనుభవం గడించడం కొంత కష్టమని రాజ్ చెప్పుకొచ్చారు. గూగుల్‌లో అన్నీ ముందుస్తుగా ప్రీ బుల్ట్ ఫ్రార్మాట్‌లో నిర్మితమై ఉంటాయని, కోర్ టీంలో సభ్యులైతే మినహా కొత్త విషయాలు నేర్చుకోవడంపై కొన్ని పరిమితులు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఒక టీంలో వచ్చిన ప్రమోషన్లను మరో టీంకు బదిలీ అయినప్పుడు పరిగణనలోకి తీసుకోరని, ఇది కొంత ఇబ్బంది కరమని వ్యాఖ్యానించారు. ఇలా రాజ్ సవివరంగా పెట్టిన పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

Kitchen: వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఈ మార్పులు తప్పనిసరి!

Viral: ఏం ఐడియా బ్రో.. గుళ్లల్లో చెప్పులు చోరీ కాకుండా ఉండేందుకు భలే చిట్కా!

Read Latest and Viral News

Updated Date - Dec 08 , 2024 | 12:43 PM