Share News

Viral: దీపావళి రోజున ఇంట్లో ఒంటరిగా మహిళ! ఇంతలో ఊహించని విధంగా..

ABN , Publish Date - Oct 26 , 2024 | 05:08 PM

దీపావళి పండగను ఒంటరిగా గడపాల్సి రావడంతో విచారంలో ఉన్న ఓ మహిళ.. డెలివరీ ఏజెంట్ చెప్పిన శుభాకాంక్షలతో ఒంటరిగా ఉన్నానన్న బాధ నుంచి బయటపడింది. ఆ రోజు ఏం జరిగిందీ చెబుతూ ఆమె షేర్ చేసిన కథనం నెట్టింట వైరల్ అవుతోంది.

Viral: దీపావళి రోజున ఇంట్లో ఒంటరిగా మహిళ! ఇంతలో ఊహించని విధంగా..

ఇంటర్నె్ట్ డెస్క్: పండగలు, పుట్టిన రోజుల్లోనే స్నేహితులు, బంధువుల విలువ తెలుస్తుంది. వృత్తివ్యాపారాల రీత్యా వేరే ఉళ్లకు వెళ్లిన అనేక మంది పండగ రోజుల్లో అయిన వాళ్లను కచ్చితంగా మిస్సవుతుంటారు. ముఖ్యమైన రోజులు ఒంటరిగా గడిపేసినందుకు ఫీలవుతారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న ఓ మహిళ తాజాగా తన అనుభవాన్ని నెట్టింట పంచుకుంది. అనుకోని అతిథి ఇచ్చిన ఊహించని సర్‌ప్రైజ్‌తో ఆ రోజు తన ముఖంలో తొలిసారిగా నవ్వు విరిసిందని చెప్పుకొచ్చింది (Viral).

Sleep Divorce: స్లీప్ డైవర్స్.. యువ జంటల్లో కనిపిస్తున్న కొత్త ట్రెండ్!


ఐదేళ్ల క్రితం తాను దిపావళి పండుగ ఎలా జరుపుకున్నదీ చెబుతూ సురభి జైన్ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘ఇది ఐదేళ్ల నాటి ఘటన. ఆ రోజు దీపావళి పండుగ. నేను బెంగళూరులో ఒంటరిగా ఉన్నా. నేనొక్కదాన్నే ఉండటంతో చాలా బాధగా అనిపించింది. నా ఫ్రెండ్స్, ఫ్లాట్ మేట్స్, కోలీగ్స్ అందరూ తమ కుటుంబాలతో గడిపేందుకు వెళ్లారు. అంత పెద్ద సొసైటీలో ఇంట్లో ఒంటరిగా అలా గడపడం నాకు విచారంగా అనిపించింది. కానీ ఆ రోజు ఓ డెలివరీ ఏజెంట్ కారణంగా విచారం మొత్తం మాయమైంది. నా ఫ్లాట్‌కు ఫుడ్ తీసుకొచ్చిన అతడు నాకు దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. ఆ రోజు నాకు శుభాకాంక్షలు చెప్పిన తొలి వ్యక్తి అతడే. ఇలాంటి వాళ్లను మనం అస్సలు మర్చిపోకూడదు. మంచి మనసుతో చేసే ఇలాంటి చిన్న పనులే మనలో ఉత్సాహం నింపుతాయి. ఇలాంటి వారి పట్ల కృతజ్ఞతగా ఉండాలి’’ అని ఆమె పేర్కొంది.

Sleep Divorce: స్లీప్ డైవర్స్.. యువ జంటల్లో కనిపిస్తున్న కొత్త ట్రెండ్!


సురభి పోస్టు చూస్తుండగానే తెగ వైరల్ అయ్యింది. అనేక మంది ఆమె అభిప్రాయంతో ఏకీభవించడమే కాకుండా తమ జీవితాల్లో ఎదురైన అనుభవాలను కూడా పంచుకున్నారు. ‘‘ఈ సారి దీపావళికి నాదీ ఇదే పరిస్థితి. పని ఒత్తిడి కారణంగా నేను ఈమారు సొంతూరికి వెళ్లలేకపోతున్నా’’ అని ఓ వ్యక్తి చెప్పాడు.

‘‘మన దేశంలో నాకు నచ్చిన విషయం ఇదే. చాలా మంది కెరీర్ కోసం, వ్యాపారాల అనేక విషయాలను త్యాగం చేస్తుంటారు. తమ గురించి తాము పట్టించుకోక, పక్కవారి బాగోగుల గురించి వాకబు చేయకుండా గడిపేస్తుంటారు. అయితే, ఈ డెలివరీ ఏజెంట్ లాంటి వ్యక్తుల మనకు జీవితం విలువను గుర్తు చేస్తుంటారు’’ అని మరో వ్యక్తి అభిప్రాయపడ్డాడు.

‘‘ గత దీపావళి సందర్భంగా ముంబైలో నేనూ ఒంటరిగా గడిపా. కొందరు ఇష్టపూర్వకంగా ఇలా ఒంటరిగా ఉంటారు. మరికొందరిని దురదృష్టం వేధిస్తుంది’’ అని వ్యాఖ్యానించాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది.

Viral: ఈసారి లాటరీ గెలుస్తానని జోక్ చేశాడు! చివరకు ఏం జరిగిందో మీరే చూడండి!

Read Latest and Viral News

Updated Date - Oct 26 , 2024 | 05:08 PM