Viral Video: క్యాబ్‌లపై నెలకు రూ.16 వేలు ఖర్చుపెడుతున్న మహిళ! షాకింగ్ ఉదంతం!
ABN , Publish Date - Jul 27 , 2024 | 10:09 PM
క్యాబ్‌ల కోసం తాను నెలకు రూ.16 వేలకు పైగా ఖర్చు పెడతానని బెంగళూరు మహిళ చెప్పింది. ఇది తన ఇంటి అద్దెలో సగానికి సమానమని చెప్పింది. దీంతో, ఈ ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరు పేరు చెబితే చాలు జనాలు అక్కడి ట్రాఫిక్ తలుచుకుని హడలిపోతారు. ఆ ట్రాఫిక్ కష్టాలకు సంబంధించిన వీడియోలను స్థానికులు నిత్యం నెట్టింట పంచుకుంటూ ఉంటారు. ట్రాఫిక్ కష్టాలు భరించలేక కొందరు ఊబెర్, ఓలా లాంటి ప్రైవేటు క్యాబులను ఆశ్రయిస్తుంటారు. అయితే, నగరానికి చెందిన ఓ మహిళ తనకు తెలీకుండానే క్యాబ్‌లపై తెగ ఖర్చుపెట్టేసింది. నెలాఖరులో ఎంతైందో గుర్తించి దిమ్మెరపోయింది. ఆమె ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకోవడంతో ఘటన వైరల్ (Viral) అవుతోంది.
క్రెడ్ యాప్ వినియోగించడం మొదలెట్టాక తనకు ఖర్చులపై ఓ అంచనా ఏర్పడిందని ఆమె చెప్పుకొచ్చింది. దీని సాయంతో జులై 1 నుంచి 25 మధ్య తాము ఎంత ఖర్చు పెట్టిందీ ట్రాక్ చేసి షాకైపోయానని చెప్పింది. 74 ఊబెర్ ట్రిప్పులకు ఏకంగా 74 ఖర్చైందని చెప్పింది. ‘‘ఊబెర్ కోసం నా ఇంటి అద్దెలో సగం ఖర్చుపెట్టా’’ అని ఆమె చెప్పుకొచ్చింది (Bengaluru Woman Spends Over ₹ 16,000 Per Month On Uber).
Viral: రెండేళ్ల క్రితం తిన్న మిరపకాయ ఎంత పని చేసిందీ! ఇతడి పరిస్థితి చూస్తే..
కాగా, ఈ పోస్టుకు నెట్టింట కామెంట్స్ వెల్లువెత్తాయి. ప్రయాణ ఖర్చులను తగ్గించుకునేందుకు కొందరు అనేక ప్రత్యామ్నాయాలను సూచించారు. ఇందుకే తాము బెంగళూరుకు వచ్చాక టూ వీలర్ కొనుక్కున్నామని కొందరు అన్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా ఖర్చుల బెంగే లేకుండా పోయిందని చెప్పారు. రైడ్ క్యాన్సిలేషన్లు, అధిక ధరల బాధ లేకుండా పోయిందన్నారు. క్యాబ్‌ల కోసం ఇంత ఖర్చు పెట్టేబదులు ఈఎమ్ఐలు చెల్లించి క్యాబ్‌లు కొనుక్కుంటే మంచిదని సూచించారు. ఈ యాప్ ఫీచర్లు బానే ఉన్నా నెలచివర్లో వెనక్కు తిరిగి ఖర్చులను చెక్ చేసుకునే ధైర్యం లేదని కొందరు వ్యాఖ్యానించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం వైరల్ అవుతోంది.