Share News

Viral: వామ్మో! బెంగళూరులో ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూశారా! నోరెళ్లబెట్టాల్సిందే!

ABN , Publish Date - Sep 30 , 2024 | 12:40 PM

బెంగళూరు‌లో ఓ త్రీడీ బిల్ బోర్డు ప్రకటన నెట్టింట వైరల్ గా మారింది. వెయిటర్ కాఫీ ఇస్తున్నట్టు ఉన్న ఈ దృశ్యం నెట్టింట కూడా హల్‌చల్ చేస్తోంది.

Viral: వామ్మో! బెంగళూరులో ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూశారా! నోరెళ్లబెట్టాల్సిందే!

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా త్రీడీ బిల్ బోర్డులంటే మనకు అమెరికానో లేదా చైనానో గుర్తొస్తాయి. ముఖ్యంగా చైనాలో త్రీడీ బిల్ బోర్డులపై యాడ్స్ నమ్మశక్యం కానీ రీతిలో ఉంటాయి. ఒకప్పటి రాజులు, డ్రాగన్స్ వంటవి వాటిని ప్రదర్శిస్తూ చూపరులు మంత్రముగ్ధులను చేస్తుంటాయి. అలాంటి ఓ బిల్ బోర్డు ప్రకటన ప్రస్తుతం బెంగళూరు వాసులు కూడా నోరెళ్లబెట్టాలా చేస్తోంది. ఈ ఉదంతం నెట్టింట కూడా వైరల్ (Viral) అవుతోంది.

Viral: వామ్మో.. రోజుకు 18 గంటల పని! ఈ స్టార్టప్ కంపెనీ సీఈఓ కష్టం చూస్తే..


Bangalore Thindies అనే రెస్టారెంట్ ఈ ప్రకటన ఇచ్చింది. రెస్టారెంట్ వారు మరో మూడు చోట్ల బ్రాంచెస్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ప్రజలకు వినూత్న రీతిలో పరిచయం చేసేందుకు ఈ ప్రకటన యాజమాన్యం ఇచ్చింది. ఒకే రోజున మూడు బ్రాంచ్‌ల ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపింది. పొడి మసాలా, ఫిల్టర్ కాఫీ కోసం ఎన్ని రెస్టారెంట్లు ఉన్నా సరిపోవు అని కామెంట్ చేసింది. ఇక ప్రకటనలో భాగంగా ఓ వెయిటర్ కాఫీని ముందుకు ఒంగి అందిస్తున్నట్టు కనిపించింది. గాల్లో భారీ ఆకారంలో వెయిటర్ నిజంగానే కాఫీ సర్వ్ చేయబోతున్నాడా అన్నట్టు ఉన్న ఈ ప్రకటన జనాలను బాగా ఆకట్టుకుంది.

Viral: మార్స్‌పై మనిషి సెటిలైతే జరిగేది ఇదే.. అమెరికా శాస్త్రవేత్త హెచ్చరిక


దీనిపై జనాలు పెద్ద ఎత్తున స్పందించారు. సంస్థ ఆలోచన మంచి సృజనాత్మకతతో కూడుకున్నదని కొందరు అన్నారు. ఇలాంటి సీన్ నిజజీవితంలో చూస్తే మరింత గొప్పగా ఉంటుందని కూడా కామెంట్ చేశారు. కొందరు మాత్రం ఈ ప్రయత్నంపై పెదవి విరిచారు. ఇలాంటి ప్రకటన వల్ల వాహనదారుల దృష్టి డ్రైవింగ్ పై నుంచి మళ్లి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు.

Viral: స్వీయ వివాహం చేసుకున్న ఇన్‌ఫ్లుయెన్సర్ ఆత్మహత్య!


త్రీడీ బిల్ బోర్డు అడ్వర్‌టైజ్‌మెంట్‌లతో సంస్థలకు ప్రయోజనాలు బాగానే ఉన్నాయని ఇప్పటికే రుజువైంది. త్రీడీ మార్కెటింగ్‌తో ప్రముఖ బ్రాండ్ల కన్వర్షన్ రేట్స్ దాదాపు 40 శాతానికి పైగా పెరిగాయట. సాధారణ బిల్ బోర్డులతో పోలిస్తే త్రీడీ బిల్ బోర్డులతో కొత్త ఉత్పత్తులను వినూత్నంగా కస్టమర్లకు పరచయం చేయొచ్చని, అవి గుర్తుండిపోయేలా చేయొచ్చని మార్కెటింగ్ నిపుణులు చెబుతున్నారు. శాంసంగ్, హ్యుండాయ్, నెట్‌ఫ్లిక్స్, నైకీ వంటి సంస్థలన్నీ త్రీడీ మార్కెటింగ్‌పై వెచ్చిస్తున్నాయి. ఇక దేశీ సంస్థలైన జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్ మాత్రం సాధారణ బిల్‌బోర్డు ప్రకటనల్లోనే సృజనాత్మకత జోడించి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. వీటి ప్రకటనలు గతంలో అనేకం వైరల్ అయ్యాయి.

Viral: డబ్బున్నోళ్లంటే భారతీయులకు అందుకే ద్వేషం! ప్రముఖ సంస్థ సీఈఓ వ్యాఖ్య

వామ్మో! పెళ్లికొచ్చిన అతిథుల నుంచి వధూవరులు రూ.2 లక్షలు చొప్పున వసూల్!

Read Latest and Viral News

Updated Date - Sep 30 , 2024 | 12:44 PM