Share News

Viral: ఎస్‌యూవీల్లో వచ్చి టీచర్ కిడ్నాప్.. తుపాకీ గురి పెట్టి బలవంతపు పెళ్లి!

ABN , Publish Date - Dec 14 , 2024 | 06:47 PM

ఇటీవలే ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సంపాదించిన ఓ యువకుడిని తుపాకీతో బెదిరించి బలవంతంగా పెళ్లి చేసిన ఘటన బీహార్‌లో వెలుగు చూసింది.

Viral: ఎస్‌యూవీల్లో వచ్చి టీచర్ కిడ్నాప్.. తుపాకీ గురి పెట్టి బలవంతపు పెళ్లి!

ఇంటర్నెట్ డెస్క్: అతడు ఇటీవల ప్రభుత్వ పోటీ పరీక్షల్లో నెగ్గి టీచర్ ఉద్యోగం పొందాడు. ఆ రోజు ఎప్పటిలాగే స్కూలుకు బయలుదేరాడు. ఇంతలో కొందరు భారీ కార్లల్లో వచ్చి అతడిని అడ్డగించారు. బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఓ చోట ఏర్పాటు చేసిన పెళ్లి మండపం వద్ద యువకుడిని తుపాకీతో బెదిరించి యువతికి ఇచ్చి వివాహం జరిపించారు. బీహార్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది (Bihar).

Viral: రహదారిపై క్రాష్ ల్యాండింగ్.. రెండు ముక్కలైన విమానం!


జాతీయ మీడియా కథనాల ప్రకారం, అవనీశ్ అనే యువ టీచర్‌ను ఇలా కిడ్నాప్ చేసి ఓ యువతితో ఆమె బంధువులు పెళ్లి చేశారు. యువతి పేరు గుంజన్. ఆమెది లఖీసరాయ్ జిల్లా. యువతి తెలిపిన వివరాల ప్రకారం, ఆమె, అవనీశ్‌ నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇటీవలే అతడు ప్రభుత్వ టీచర్ అయ్యాడు. ఇన్నేళ్లుగా వారిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. యువతి యువకుడి ఇంటికి కూడా వెళ్లింది. ఈ క్రమంలో పెళ్లి ప్రస్తావన తేగా అతడు నిరాకరించాడు. యువతి కుటుంబసభ్యులు చెప్పినా ఖాతరు చేయలేదు.పెళ్లి తరువాత యువతి కుటుంబసభ్యులు వధూవరులనిద్దరినీ యువకుడి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ మళ్లీ గొడవ జరిగింది. ఈ క్రమంలో అక్కడి నుంచి పారిపోయిన అవనీశ్.. యువతిని భార్యగా అంగీకరించేదే లేదని స్పష్టం చేశారు. ఆమె చెప్పేవన్నీ అబద్ధాలని కుండబద్దలు కొట్టాడు.


Musk - Gates: అదే జరిగితే.. బిల్ గేట్స్ దివాలా తీస్తారు: ఎలాన్ మస్క్

‘‘ఆమెతో నాకు ఎటువంటి ప్రేమ వ్యవహారం లేదు. ఆమె తరచూ నాకు ఫోన్ చేసి వేధించేది. నా వెంట పడేది. ఘటన రోజు నేను ఆటోలో స్కూలుకు వెళుతుండగా కొందరు నన్ను స్కార్పియోలో వెంబడించారు. నన్ను బలవంతంగా తీసుకెళ్లి కొట్టారు. చివరకు గుళ్లో బలవంతంగా పెళ్లి చేశారు. నేను ఎంత వద్దని మొత్తుకున్నా వినలేదు’’ అని వాపోయాడు. కాగా, యువతీయువకులిద్దరూ పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి.

Read Latest and Viral News

Updated Date - Dec 14 , 2024 | 06:54 PM