Share News

Viral Video: ఈ వ్యక్తి నిజంగా గొప్పవాడే.. ప్రాణాలతో పోరాడుతున్న పిచ్చుకను ఎలా కాపాడాడో చూడండి.. వీడియో వైరల్..

ABN , Publish Date - Sep 25 , 2024 | 02:09 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎన్నో వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. కొన్ని వీడియోలు మనల్ని ఆకట్టుకుని హృదయాలను గెలుచుకుంటే, మరికొన్ని హృదయవిదారకంగా ఉంటూ గుండెలను మెలిపెడతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: ఈ వ్యక్తి నిజంగా గొప్పవాడే.. ప్రాణాలతో పోరాడుతున్న పిచ్చుకను ఎలా కాపాడాడో చూడండి.. వీడియో వైరల్..
sparrow

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎన్నో వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. కొన్ని వీడియోలు మనల్ని ఆకట్టుకుని హృదయాలను గెలుచుకుంటే, మరికొన్ని హృదయవిదారకంగా ఉంటూ గుండెలను మెలిపెడతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి ఓ చిన్న పక్షి (Bird)ని కాపాడాడు. చాలా మంది జంతువులతో క్రూరంగా వ్యవహరిస్తారు. అయితే ఆ వ్యక్తి మాత్రం పక్షికి సహాయం చేసి తన పెద్ద మనసును చాటుకున్నాడు (Viral Video).


mksinfo.official అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో, ఒక చిన్న పక్షి నేలపై అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆ సమయంలో ఒక వ్యక్తి వచ్చి ఆ పక్షిపై నీరు (Water) పోశాడు. నీరు పోసిన వెంటనే స్పృహలోకి వచ్చిన పక్షి రెక్కలు విప్పుతూ కూర్చుంది. దాహంతో ఉన్న పక్షికి ఆ వ్యక్తి నీరు అందించాడు. ఆ పక్షి గ్లాసు నుంచి చక్కగా నీరు తాగింది. అనంతరం బలం తెచ్చుకుని గాల్లోకి ఎగిరిపోయింది. ఆ ఘటన మొత్తాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


ఎంతో మానవత్వంతో వ్యవహరించి ఆ పక్షిని కాపాడిన వ్యక్తిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 45 లక్షల మంది వీక్షించారు. 2.17 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``జాగ్రత్త.. పక్షి ముక్కులోకి నీరు వెళితే ప్రాణం పోతుంది``, ``ఆ వ్యక్తి దయామయుడు``, ``పక్షులకు ఎప్పుడూ నీరు అందుబాటులో ఉంచడం ముఖ్యం`` అంటూ నెటిజన్లు కామెంట్లుచేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ ఆంటీ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఒకేసారి ఆరు చపాతీలను ఎలా వత్తేస్తోందో చూడండి..


Viral Video: అయ్యో.. స్పైడర్ మ్యాన్‌కు ఇలాంటి పరిస్థితా?.. రైల్వే స్టేషన్ ముందు ఎందుకు అడుక్కుంటున్నాడంటే..


Viral Video: కార్ గ్యారేజ్ ఓపెన్ చేసిన వ్యక్తికి షాక్.. లోపల భారీ ఆకారాన్ని చూసి పరుగులు.. వీడియో వైరల్..


Puzzle: మీ మెదడుకు చిక్కుముడి.. వీటిల్లో ఏ పైప్ ద్వారా బకెట్ నిండుతోందో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 25 , 2024 | 02:09 PM