Viral Video: ఈ ఆంటీ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఒకేసారి ఆరు చపాతీలను ఎలా వత్తేస్తోందో చూడండి..
ABN , Publish Date - Sep 25 , 2024 | 12:57 PM
బ్రెయిన్ ఉపయోగిస్తే స్ట్రెయిన్ తగ్గుతుంది అనేది ఓ సినిమా డైలాగ్. కష్టసాధ్యమైన పనులకు సులభమైన పరిష్కారాలు కనుక్కొని చాలా మంది పెద్దగా శ్రమ లేకుండా పనులు పూర్తి చేస్తుంటారు. ముఖ్యంగా వంటింట్లో మహిళలు ఉపయోగించే ట్రిక్కులు చూస్తే మతి పోవాల్సిందే.
బ్రెయిన్ ఉపయోగిస్తే స్ట్రెయిన్ తగ్గుతుంది అనేది ఓ సినిమా డైలాగ్. కష్టసాధ్యమైన పనులకు సులభమైన పరిష్కారాలు కనుక్కొని చాలా మంది పెద్దగా శ్రమ లేకుండా పనులు పూర్తి చేస్తుంటారు. ముఖ్యంగా వంటింట్లో మహిళలు ఉపయోగించే ట్రిక్కులు (Kitchen Tricks) చూస్తే మతి పోవాల్సిందే. వంట త్వరగా, సులభంగా పూర్తయ్యేందుకు వారు ఎప్పటికప్పుడు రకరకాల మార్గాలు అన్వేషిస్తుంటారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో చూసిన వారు ఆ మహిళ తెలివితేటలపై ప్రశంసలు కురిపిస్తున్నారు (Viral Video).
@Patnasehainji అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. సాధారణంగా చపాతీలు లేదా పూరీలు చేయడం ఎక్కువ టైమ్, శ్రమతో కూడుకున్న పని. ఒక్కో చపాతీ (Chapati) వత్తేందుకు చాలా సమయం పడుతుంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో మహిళ మాత్రం చాలా ఈజీగా ఒకే ఒక్క నిమిషంలో దాదాపు 6 చపాతీలు చేసేసింది. ముందుగా పిండిని ఉండలుగా చేసుకుంది. ఆ తర్వాత పాలిథిన్ కవర్‌ను తీసుకుని దానిపైన ఓ పూరీ ఉండను ఉంచింది. దానిపైన మరో కవరు పెట్టింది. దానిపైన ఇంకో చపాతీ పిండి ముద్ద ఉంచింది. అలా మొత్తం ఆరు ఉండలను ఒకదానిపై ఒకటి ఉంచింది. ఆ తర్వాత అన్నింటినీ ఒకే సారి చెక్క పీటతో బలంగా నొక్కింది. తీసి చూడగా అన్ని ఉండలూ చపాతీలుగా మారాయి.
ఆ తర్వాత వాటిని తీసి పెనంపై వేసి చక్కగా కాల్చింది. ఇలా సమయం ఆదా చేస్తూ చాలా తక్కువ టైమ్‌లో చపాతీలు చేసిన ఈమెను చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 6.5 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. దాదాపు ఆరు వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``ఈమె తెలివికి హ్యాట్సాఫ్``, ``భారతయ గృహిణులు ఇంజినీర్లకు ఏ మాత్రం తక్కువ కారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Puzzle: మీ మెదడుకు చిక్కుముడి.. వీటిల్లో ఏ పైప్ ద్వారా బకెట్ నిండుతోందో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..