Share News

Viral: తల్లిదండ్రులను కాపాడేందుకు బాలుడి సాహసం.. చికట్లో మెరుపుల వెలుగులో..

ABN , Publish Date - May 09 , 2024 | 07:09 PM

సుడిగాలిలో చిక్కుకుని తీవ్రగాయాల పాలైన తల్లిదండ్రులను కాపాడాడు ఓ అమెరికా చిన్నారి. రాత్రి వేళ మెరుపుల వెలుగులో ఒంటరిగా పరిగెత్తి సహాయకుల్ని తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఉదంతం వైరల్‌గా మారింది.

Viral: తల్లిదండ్రులను కాపాడేందుకు బాలుడి సాహసం.. చికట్లో మెరుపుల వెలుగులో..

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల అమెరికాలో సుడిగాలులు నానా బీభత్సం సృష్టించాయి. ఆస్తినష్టం ప్రాణనష్టం కలిగించాలి. అయితే, సుడిగాలిలో చిక్కుకుని మరణం అంచుల వరకూ వెళ్లిన తల్లిదండ్రుల్ని కాపాడిన బాలుడి ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. అతడి ధైర్యసాహసాలకు నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి.

ఒక్లహోమాకు చెందిన వెయిన్, లిండీ బేకర్ దంపతులకు బ్రాన్సన్ అనే 9 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల కుమారుడితో పాటు ఓ వాహనంలో ప్రయాణిస్తున్న వారు సుడిగాలిలో చిక్కుకుపోయారు. కారు తిరగబడటంతో తీవ్ర గాయాలపాలయ్యారు. వెయిన్, లిండీ ఇద్దరికీ మెడ, వెన్నెముక విరిగిపోయాయి. లిండీకి ఊపిరితిత్తుల్లో చిల్లుకూడా పడింది. ఈ పరిస్థితుల్లో కారులోంచి ఎలాగో బయటపడ్డ బ్రాన్సన్ తన ధైర్యసాహసాలతో వారిని కాపాడాడు (Boy 9 Saves Parents After US Tornado Tosses Car Please Dont Die I Will Be Back).

Viral: విమానంలో ఇదేందయ్యా? సీటు కోసం ఎలా కొట్టుకున్నారో చూడండి!


కారులో తీవ్రగాయాలతో కదలలేకుండా ఉన్న తల్లిదండ్రులకు చనిపోవద్దంటూ చెప్పి ఆ బాలుడు రాత్రి వేళ చిమ్మచీకట్లో సాయం కోసం పరుగు ప్రారంభించాడు. మెరుపుల వెలుగులోనే దారి వెతుక్కుంటూ తనకు తెలిసిన వారి ఇంటికి వెళ్లి జరిగిన ప్రమాదం గురించి చెప్పాడు. అంతరాత్రిలో కూడా అతడు కేవలం పది నిమిషాల్లోనే మైలు దూరం పరిగెత్తాడు. ఆ తరువాత వారు వచ్చిన బాలుడి తల్లిదండ్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నట్టు స్థానిక మీడియా తెలిపింది .

బ్రాన్సన్ అతడి తల్లిదండ్రుల విషయంలో సూపర్ హీరో అని అతడి బాబాయ్ వ్యాఖ్యానించాడు. ఆ రాత్రి చిన్నారి ఎటువంటి బెరుకూ లేకుండా ఒంటరిగానే తాను చేయవల్సింది చేశాడని చెప్పాడు.

Read Viral and Telugu News

Updated Date - May 09 , 2024 | 07:27 PM