Share News

Viral: వీధుల్లో గర్భవతి భిక్షాటన! ఆమె ముందు యువకుడి డాన్స్! ఎందుకో తెలిస్తే..

ABN , Publish Date - Jul 18 , 2024 | 09:41 PM

మనవత్వం మూర్తిభవించిందా అన్నట్టు ఉన్న ఓ యువకుడి ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అతడు చేసిన పనికి నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి.

Viral: వీధుల్లో గర్భవతి భిక్షాటన! ఆమె ముందు యువకుడి డాన్స్! ఎందుకో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: మనవత్వం మూర్తిభవించిందా అన్నట్టు ఉన్న ఓ యువకుడి ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అతడు చేసిన పనికి నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. ఘటన ఎక్కడ జరిగిందో తెలియరానప్పటికీ జనాలను మాత్రం ఈ వీడియో విపరీతంగా ఆకట్టుకుంటోంది (Viral).

ప్రభాస్ పేరిట ఉన్న పేరడీ అకౌంట్‌లో ఈ వీడియోను పోస్టు చేశారు. ఇందులో కనిపించిన దాని ప్రకారం, గర్భంతో ఉన్న ఓ మహిళ నడవలేక వీధుల్లో నేలపై దేకుతూ భిక్షాటన చేస్తోంది. దురదృష్టవశాత్తూ ఆమె కష్టం ఎవరినీ కదిలించలేదు. ఆమెను చూసినా కూడా అనేక మంది పట్టించుకోకుండా తమమానాన తాము వెళ్లిపోయారు. ఈ దారుణ దృశ్యం ఓ యువకుడిని కదిలించింది. దీంతో, ఆమెకు ఆ రోజుకు సరిపడా డబ్బులు సమకూర్చేందుకు రంగంలోకి దిగాడు (Boy performs dance on road to collect funds for pregnant beggar watch).

Viral: వార్నీ..ఈ సీన్ ఎప్పుడూ చూడలేదే! బస్సు టాపు ఎక్కి కాకుల జర్నీ..


యువతి ముందే అతడు.. డబ్బులు వేసేందుకు వీలుగా తన టోని తిరగేసి పెట్టాడు. ఆ తరువాత చూపరులు ఆశ్చర్యపోయేలా డ్యాన్స్ ప్రదర్శన చేశాడు. అతడి బ్రేక్ డ్యాన్స్ చూసి అబ్బురపడ్డారు. వెంటనే అతడి టోపీలో కనకవర్షం కురిసింది. అలా సేకరించిన డబ్బును యువకుడు ఆ మహిళకు ఇచ్చాడు.

వీడియోలో ఇదంతా చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మానవత్వం మూర్తిభవించినట్టుగా ఉన్నాడంటూ కామెంట్స్ పెట్టారు. ఈ యువకుడిని కలవాలని ఉందని మరికొందరు కామెంట్ చేశారు. కన్నీళ్లుపెట్టించాడని మరొకరు అన్నారు. అసలైన సూపర్ హీరో అంటే ఇదే అంటూ మరొకరు యువకుడిని ఆకాశానికెత్తేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్‌గా మారింది.

Read Viral and Telugu News

Updated Date - Jul 18 , 2024 | 09:41 PM