Viral Video: ఆ బాలికల ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. టీజింగ్ చేసిన యువకుడికి నడిరోడ్డుపై ఎలా బుద్ధి చెప్పారంటే..
ABN , Publish Date - Aug 17 , 2024 | 01:34 PM
తమను రోజూ వెంబడిస్తూ మాటలతో వేదిస్తున్న ఓ వ్యక్తికి కొందరు బాలికలు గట్టిగా బుద్ధి చెప్పారు. పట్టపగలు నడిరోడ్డుపై అతడిని బెల్ట్‌తో కొట్టారు. ముందుగా అతడిని పట్టుకుని నడిరోడ్డు మీదే నిలదీశారు. అనంతరం అతడిని చితక్కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమను రోజూ వెంబడిస్తూ మాటలతో వేదిస్తున్న ఓ వ్యక్తికి కొందరు బాలికలు (Girls) గట్టిగా బుద్ధి చెప్పారు. పట్టపగలు నడిరోడ్డుపై అతడిని బెల్ట్‌తో కొట్టారు. ముందుగా అతడిని (eve teaser) పట్టుకుని నడిరోడ్డు మీదే నిలదీశారు. అనంతరం అతడిని చితక్కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలోని బాలికల ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. @gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).
ప్రతిరోజూ స్కూల్‌కు వెళుతున్న కొందరుఇలా బాలికలతో ఆ యువకుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. వెకిలిగా కామెంట్లు చేస్తున్నాడు. కొన్ని నెలలుగా ఇలాగే జరుగుతోంది. ఇన్ని రోజులూ ఓపిక పట్టిన అమ్మాయిల్లో ఇక సహనం నశించింది. అతడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. అతడిని నడిరోడ్డుపై పట్టుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఆ ఘటనను స్థానికులు వీడియో తీశారు. దీంతో ఆ యువకుడు తన మొహాన్ని దాచుకునే ప్రయత్నం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోను ఇప్పటివరకు 35 లక్షల మందికి పైగా వీక్షించారు. 51 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఆ అమ్మాయిల ధైర్యాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు చేశారు. ``బెల్ట్ ట్రీట్‌మెంట్ బాగుంది``, ``అమ్మాయిలు తమ రక్షణ బాధ్యతను తామే తీసుకున్నారు``, ``ఇదే సరైన పద్ధతి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: స్థంభంపై ఇరుక్కుపోయిన జాతీయ జెండా.. మెరుపులా వచ్చిన పక్షి ఏం చేసిందో చూడండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి