Share News

Viral Video: స్థంభంపై ఇరుక్కుపోయిన జాతీయ జెండా.. మెరుపులా వచ్చిన పక్షి ఏం చేసిందో చూడండి..!

ABN , Publish Date - Aug 17 , 2024 | 01:09 PM

దేశం యావత్తు 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంది. అందరూ జాతీయ జెండాలను ఎగురవేసుకుని సంబరాలు చేసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేళ కేరళలో ఓ అద్భుత ఘటన జరిగింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Viral Video: స్థంభంపై ఇరుక్కుపోయిన జాతీయ జెండా.. మెరుపులా వచ్చిన పక్షి ఏం చేసిందో చూడండి..!
National Flag gets stuck, bird comes and unfurls it

దేశం యావత్తు 78వ స్వాతంత్య్ర దినోత్సవ (Independence Day) వేడుకలను ఘనంగా జరుపుకుంది. అందరూ జాతీయ జెండాలను (National Flag) ఎగురవేసుకుని సంబరాలు చేసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేళ కేరళలో (Kerala) ఓ అద్భుత ఘటన జరిగింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. జాతీయ జెండాను ఎగురవేస్తుండగా, అది స్థంభం పై భాగంలో ఇరుక్కుపోయింది. తాడు ఎంతలా లాగినా జెండా విచ్చుకోలేదు. ఆ సమయంలో ఓ అద్భుతం జరిగింది. @shilpa_cn అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).


స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేరళలోని ఓ స్కూల్‌లో టీచర్లు, పిల్లలు కూడా జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ జెండాను ఎగరవేస్తుండగా అది పైభాగంలో చిక్కుకుపోయింది. తాడు ఎంత లాగినా జెండా విడలేదు. ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ పక్షి (Bird) అక్కడకు వచ్చి జెండాను విప్పి వెంటనే ఎగిరిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను కొద్ది గంటల్లోనే 14 లక్షల మందికి పైగా వీక్షించారు.


ఈ వైరల్ వీడియోను 51 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది మేజికల్``, ``ఇది దైవ ఘటన``, ``ఈ ప్రకృతిలో ఏదో దాగి ఉంది. మనుషులే అర్థం చేసుకోలేకపోతున్నారు``, ``ఇలా జరగడానికి అవకాశం ఉందా? వీడియోను ఎడిట్ చేశారా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: క్యాబ్ ఆపమని ఆమె చేసిన పనికి డ్రైవర్ షాక్.. వెంటనే ఎలా కాపాడాడంటే.. వీడియో వైరల్!


Viral Video: వామ్మో.. చూస్తే రోమాలు నిక్కబోడుచుకోవడం ఖాయం.. జింకను ఎలా మింగేసిందో చూడండి..!


Viral: ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా మెసేజ్.. రూ.220 కట్ అయినట్టు ఫాస్టాగ్ మెసేజ్.. అసలేం జరిగిందంటే..


Optical Illusion: మీ కళ్ల శక్తి ఏంటో తెలుసుకోండి.. ఈ ఫొటోలో దాక్కున్న పిల్లిని 10 సెకెన్లలో కనిపెట్టండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 17 , 2024 | 01:09 PM