Share News

Viral: బిడ్డకు ఆ పేరు పెట్టొద్దు! తల్లిదండ్రులకు అడ్డుపడ్డ కోర్టు!

ABN , Publish Date - Sep 15 , 2024 | 03:42 PM

బ్రెజిల్‌లో తాజాగా ఓ అసాధారణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. తమ బిడ్డకు ఈజిప్టు రాజు పేరు పెడదామనుకున్న తల్లిదండ్రులను అడ్డుకున్న స్థానిక కోర్టు, ఆ తరువాత వారి వివరణతో ఏకీభవించి చిన్నారికి అదే పేరు పెట్టేందుకు అనుమతించింది.

Viral: బిడ్డకు ఆ పేరు పెట్టొద్దు! తల్లిదండ్రులకు అడ్డుపడ్డ కోర్టు!

ఇంటర్నెట్ డెస్క్: బ్రెజిల్‌లో తాజాగా ఓ అసాధారణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. తమ బిడ్డకు ఈజిప్టు రాజు పేరు పెడదామనుకున్న తల్లిదండ్రులను అడ్డుకున్న స్థానిక కోర్టు, ఆ తరువాత వారి వివరణతో ఏకీభవించి చిన్నారికి అదే పేరు పెట్టేందుకు అనుమతించింది (Viral).

Viral: సక్సెస్ అంటే ఇదీ.. సిలికాన్ వ్యాలీలోని ఈ ఎన్నారై ఇల్లు చూస్తే..

కాటరీనా, డానిల్లో ప్రిమోలా దంపతులకు ఇటీవల ఓ బిడ్డ పుట్టాడు. అతడికి వారు పీయే అని పేరు పెడదామనుకున్నారు. ఈజీప్టును పరిపాలించిన తొలి నల్లజాతి రాజు పీయే పేరునే వారు బిడ్డకు పెడదామనుకున్నారు. అయితే, బాలే నాట్య రీతిలోని ఓ భంగిమ పేరు పీలియే. రెండు పేర్లకు పోలిక ఉండటంతో బిడ్డ భవిష్యత్తులో హేళనకు గురయ్యే అవకాశం ఉండటంతో అక్కడి అధికారులు ఈ పేరును రికార్డుల్లో నమోదు చేసుకునేందుకు అంగీకరించలేదు. దీంతో, విషయం కోర్టుకు చేరింది (Brazil Court Blocks Couples Chosen Baby Name To Prevent Bullying In Future).

Viral: ఈ రక్తం ధర లీటరుకు రూ.12 లక్షలు! ఇంత ఖరీదు ఎందుకో తెలిస్తే..


కోర్టు కూడా తొలుత ఆ తల్లిదండ్రుల విజ్ఞప్తిని తిరస్కరించింది. అదే పేరును కొనసాగిస్తే బిడ్డ భవిష్యత్తులో హేళనకు గురయ్యే అవకాశం ఉందని, ఇది అతడి ఎదుగుదలపై ప్రభావం చూపించొచ్చని హెచ్చరించింది. ఇలా, బిడ్డకు పేరు పెట్టడంలో జాప్యం జరగడంతో చిన్నారికి టీకాలు ఇతర మందులు కూడా సమయానికి అందలేదు.

Viral: విమానం ఎంట్రీ డోర్స్ ఎడమ వైపే ఎందుకుంటాయో తెలుసా?

అయితే, పీయే పేరు వెనకున్న సాంస్కృతిక ప్రాముఖ్యతను చిన్నారి తల్లిదండ్రులు కోర్టుకు వివరించారు. నల్లజాతి వారి చరిత్రకున్న ప్రాముఖ్యతను చాటే క్రమంలో తమ బిడ్డకు ఈ పేరు నిర్ణయించామన్నారు. అంతేకాకుండా, హేళనను అడ్డుకునేందుకు ఓ పేరును పక్కనపెట్టేయడం సరైన విధానం కాదని వాదించారు. సమాజంలో అవగాహన పెంచడం ద్వారానే వేధింపులు, హేళనకు అడ్డుకట్ట వేయాలని స్పష్టం చేశారు. వారి వాదనతో కోర్టు ఏకీభవించడంతో బిడ్డకు పీయే అనే పేరు ఖరారైంది. అధికారులు అదే పేరును తమ రికార్డుల్లో కూడా నమోదు చేసుకున్నారు.

Viral: సముద్రంలో కూలనున్న ఇంటిని రూ.3 కోట్లకు కొన్న వ్యక్తి! ఎందుకంటే..


కాగా, 2013లో కూడా ఓ అమెరికా చిన్నారికి మసాయాఅనే పెట్టడాన్ని స్థానిక కోర్టు అడ్డుకుంది. ఓ వర్గం మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందంటూ చిన్నారికి ఆ పేరు పెట్టొద్దని తల్లిదండ్రులకు స్పష్టం చేసింది. ఇక ఫ్రాన్స్‌లో కూడా ఇలాంటి కేసులు వెలుగు చూశాయి. న్యూటెల్లా, ప్రిన్స్ విలియమ్ అనే పేర్లతో పిల్లలు హేళనకు గురయ్యే అవకాశం ఉందంటూ అక్కడి కోర్టులు తల్లిదండ్రుల ప్రయత్నాలకు బ్రేకులు వేశాయి.

Read Latest and Viral News

Updated Date - Sep 15 , 2024 | 03:53 PM