Share News

Bread Facts: మీరు తినే బ్రెడ్ నాణ్యత ఎంత? బ్రెడ్ ప్యాకెట్ మీద ఉన్న ఈ 6 విషయాలు తేల్చేస్తాయ్..!

ABN , Publish Date - Jul 17 , 2024 | 02:09 PM

బ్రెడ్ చాలామంది అల్పాహారంలో భాగం. చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు అందరూ బ్రెడ్ ను తినడానికి ఇష్టపడతారు. కొందరు శాండ్విచ్ గానూ, మరికొందరు జామ్ తోనూ, ఇంకొందరు పాలతోనూ బ్రెడ్ తీసుకుంటూ ఉంటారు. అయితే..

Bread Facts: మీరు తినే బ్రెడ్ నాణ్యత ఎంత? బ్రెడ్ ప్యాకెట్ మీద ఉన్న ఈ 6 విషయాలు తేల్చేస్తాయ్..!
bread quality

బ్రెడ్ చాలామంది అల్పాహారంలో భాగం. చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు అందరూ బ్రెడ్ ను తినడానికి ఇష్టపడతారు. కొందరు శాండ్విచ్ గానూ, మరికొందరు జామ్ తోనూ, ఇంకొందరు పాలతోనూ బ్రెడ్ తీసుకుంటూ ఉంటారు. బ్రెడ్ లో వైట్ బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ అని వివిధ రకాలు ఉన్నాయి. చాలామంది తాము తినే బ్రెడ్ తాజాగా ఉంటే చాలు అది నాణ్యమైనదే అనే భ్రమలో ఉంటారు. అయితే మీరు తింటున్న బ్రెడ్ నాణ్యత ఎంత? బ్రెడ్ ను తయారుచేసే కంపెనీలు బ్రెడ్ ప్యాకెట్ మీద ఒక లేబుల్ ముద్రిస్తుంది. ఆ లేబుల్ లో ఉన్న 6 విషయాల ద్వారా బ్రెడ్ నాణ్యతను చెప్పేయవచ్చు. అవేంటో తెలుసుకుంటే..

Weight Loss: కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉన్న ఈ ఆహారాలు తింటే చాలు.. ఎంత తొందరగా బరువు తగ్గుతారంటే..!



అదనపు చక్కెరలు..

బ్రెడ్ తయారు చేసేటప్పుడు ఈస్ట్ ఏర్పడటానికి చక్కెర అవసరం అవుతుంది. కాబట్టి బ్రెడ్ కొనుగోలు చేసేటప్పుడు అందులో అదనపు చక్కెర కలిపారా లేదా అనేది చెక్ చెయ్యాలి. లేబుల్ మీద దీని గురించి సమాచారం ఉంటుంది. ఫ్యాక్టరీలలో తయారయ్యే బ్రెడ్ లో అదనపు చక్కెరలు, తేనె, ఇతర స్వీటెనర్లను ఉపయోగిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం.

అదనపు ఉప్పు..

బ్రెడ్ తయారీకి చక్కెర ఎలాగైతే అవసరం అవుతుందో ఉప్పు కూడా అలాగే అవసరం. బ్రెడ్ తయారీ సంస్థలు బ్రెడ్ రుచి మెరుగుపరచడానికి ఉప్పును ఎక్కువగా జోడిస్తుంటాయి. ఒక్క బ్రెడ్ ముక్కలో 100-200మి.గ్రా కంటే ఎక్కువ ఉప్పు ఉండకూడదు. బ్రెడ్ ప్యాకెట్ మీద ఉప్పు ఎంత పరిమాణంలో ఉపయోగించారో తనిఖీ చెయ్యాలి.

Jaggery: ఆహారంలో చక్కెరకు బదులుగా బెల్లం చేర్చుకుంటే జరిగేదేంటి? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే..!



పదార్థాలు..

బ్రౌన్ బ్రెడ్, వీట్ బ్రెడ్, మల్టీ గ్రెయిన్ బ్రెడ్ వంటివి ఆరోగ్యానికి మేలు చేస్తాయని తరచుగా వాటినే తీసుకుంటూ ఉంటారు. కానీ చాలా ఫ్యాక్టరీలలో బ్రెడ్ తయారు చేసేటప్పుడు ఇతర రకాల పిండిని కూడా గోధుమ పిండితో కలుపుతారు. దీనివల్ల బ్రెడ్ మరింత రుచిగా మారుతుంది. పైగా పిండి పొదుపు అవుతుంది. కాబట్టి బ్రెడ్ తయారీకి ఏయే పదార్థాలు ఉపయోగించారో లేబుల్ మీద తనిఖీ చెయ్యాలి.

డేట్..

బ్రెడ్ తయారుచేసిన తరువాత ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. చాలామంది ఎక్స్‌పైరీ డేట్ తనిఖీ చేస్తుంటారు. కానీ కొందరు మాత్రం ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. ఫ్రిడ్జ్ లో పెడితే గడువు దాటినా బాగుంటుందనే అపోహలో గడువు తేదీ పట్టించుకోరు.

పాదాలు, మడమల్లో ఈ లక్షణాలు ఉంటే చక్కెర స్థాయిలు ఎక్కువున్నట్టే..!


ప్రిజర్వేటివ్స్..

ఏ ఆహార పదార్థం అయినా తయారుచేసి ప్యాక్ చేసన తరువాత అది ఎక్కువకాలం తాజాగా ఉండటం కోసం కంపెనీలు ప్రిజర్వేటివ్స్ ఉపయోగిస్తాయి. దీని వల్ల పదార్థాలు తాజాగా అనిపించినా నాణ్యత పరంగా చూస్తే పేలవంగా ఉంటాయి. పైగా ఇవి ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. బ్రెడ్ కొనేముందు ప్రిజర్వేటివ్స్ ఉపయోగించారేమో లేబుల్ మీద తనిఖీ చెయ్యాలి.

ఫైబర్..

చాలామంది బ్రెడ్ లో ఫైబర్ కంటెంట్ ఉంటుందనే కారణంతో దీన్ని ఆరోగ్యమైనదిగా పరిగణిస్తారు. అందుకే బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రెయిన్ బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్ ను ఎంచుకుంటారు. అయితే బ్రెడ్ తయారుచేసేటప్పుడు ధాన్యాలలో ఫైబర్ చాలా కోల్పోతుంది. కాబట్టి బ్రెడ్ ప్యాకెట్ మీద ఇచ్చిన లేబుల్ లో బ్రెడ్ లో ఫైబర్ కంటెంట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి.

రాత్రిపూట చేసే ఈ పొరపాట్ల వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయి..!

వర్షాకాలంలో ఈ కాంబినేషన్ ఫుడ్స్ అస్సలు తినకండి..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 17 , 2024 | 02:10 PM