Viral Video: పెళ్లిలో పురోహితుడి చేయి పట్టుకున్న వధువు.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!
ABN , Publish Date - Aug 06 , 2024 | 06:06 PM
హిందూ సాంప్రదాయాల ప్రకారం వివాహ వేడుకలో పురోహితుడిది అతి కీలక పాత్ర. పురోహితుడు లేకుండా సాధారణంగా పెళ్లిళ్లు జరగవు. కొందరు పురోహితులు చాలా గంభీరంగా ఉండి, మంత్రాలు పఠిస్తుంటారు. మరికొందరు మాత్రం సందర్భానుసారం హాస్యం పండిస్తూ నవ్వులు పూయిస్తుంటారు.
హిందూ సాంప్రదాయాల ప్రకారం వివాహ వేడుకలో (Wedding) పురోహితుడిది (Pandit ji) అతి కీలక పాత్ర. పురోహితుడు లేకుండా సాధారణంగా పెళ్లిళ్లు జరగవు. కొందరు పురోహితులు చాలా గంభీరంగా ఉండి, మంత్రాలు పఠిస్తుంటారు. మరికొందరు మాత్రం సందర్భానుసారం హాస్యం పండిస్తూ నవ్వులు పూయిస్తుంటారు. పెళ్లి సమయంలో ఆచారాల గురించి వధూవరులకు పూర్తి అవగాహన లేకపోతే గందరగోళం నెలకొంటుంది. అలాంటి సమయంలో పురోహితుడు వారికి మార్గనిర్దేశనం చేస్తూ నవ్విస్తుంటాడు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
jaygogadecoration అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో, పురోహితుడు వధూవరులకు తగు సూచనలు ఇస్తున్నాడు. ఒకరి చేయి ఒకరు పట్టుకోవాలని వధువుకు (Bride) చెబుతున్నాడు. అయితే గందరగోళానికి గురైన వధువు.. వరుడి చేయి కాకుండా పురోహితుడు చేతిని పట్టుకుంది. దానికి పురోహితుడు నవ్వుతూ.. ``పెళ్లికొడుకు చేయి పట్టుకోవాల``ని చెప్పాడు. దీంతో ఆ వధువు సిగ్గుపడి నవ్వుకుంది. అనంతరం వరుడి చేయి పట్టుకుంది. ఈ ఫన్నీ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల్లో వ్యూస్ దక్కించుకుంది. 16 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``పాపం.. ఆ వధువు చాలా కన్ఫ్యూజన్‌లో ఉంది``, ``పురోహితుడిది కూడా తప్పు ఉంది``, ``పెళ్లి చేసినందుకు థ్యాంక్స్ చెబుతోంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral: ఇదెక్కడి విడ్డూరం.. తలలో పేను ఉందని విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. అసలేం జరిగిందంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి