Share News

Viral: పెళ్లి దుస్తుల్లో యువతి బైక్ నడుపుతూ వరుడి కోసం వెతుకులాట!

ABN , Publish Date - Dec 16 , 2024 | 11:11 PM

పెళ్లి దుస్తుల్లో ఓ యువతి బైక్ నడుపుతూ వరుడి కోసం వెతుకుతున్నట్టు ఉన్న ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Viral: పెళ్లి దుస్తుల్లో యువతి బైక్ నడుపుతూ వరుడి కోసం వెతుకులాట!

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి దుస్తుల్లో ఓ యువతి బైక్ నడుపుతూ వరుడి కోసం వెతుకుతున్నట్టు ఉన్న ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సూపర్ బైక్ నడుపుతూ ఆమె ఏకంగా హైవేపై దూసుకుపోతుంటే జనాలు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది (Viral).

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, సదరు యువతి మెరూన్ రంగు పెళ్లి చీర ధరించి భారీ బైక్ నడుపుతూ ఇతర వాహనదారులు ఆశ్చర్యపోయేలా చేసింది. హైవేపై ప్రయాణిస్తున్న వారందరూ ఆమెనే చూస్తూ నోరెళ్లబెట్టారు. కొందరు ఫొటోలు కూడా తీసుకున్నారు. కానీ యువతి మాత్రం ఇవేమీ పట్టనట్టు ఏదో లక్ష్యం దిశగా ముందుకు దూసుకుపోయింది. ప్రియుడి కానరాక.. అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో వినిపిస్తున్న పాట వీడియోను మరింత రక్తికట్టించింది.

Viral: 43 ఏళ్లల్లో 12 సార్లు విడాకులు తీసుకుని మళ్లి కలిసిపోయారు! ఎందుకంటే..


ఇక వీడియోపై జనాలు పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు. అసలేం జరిగిందో తొలుత అర్థంకాక కొందరు తికమకపడ్డారు. వధువు ధైర్యసాహసాలను కొందరు మెచ్చుకున్నారు. పెళ్లి దుస్తుల్లో ఉన్నా ఆమె ఒంటరిగా ఈ సాహసానికి దిగడం కూడా జనాలను ఆశ్చర్యపరిచింది. దీంతో, వారు ఆమె భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరేమో సరదా వ్యాఖ్యలు కూడా చేశారు. ఆమె బైక్ కూడా కట్నంలో భాగమై ఉంటుందని కొందరు అన్నారు. తప్పిపోయిన వరుడి కోసం వెతుకుతోందని కొందరు వ్యా్ఖ్యానించారు. కానీ ఆమెను వెతుక్కుంటూ వరుడే వస్తాడని మరికొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. మరి దీనిపై మీరూ ఓ లుక్కేయండి.

Viral: మరో మహిళ భర్త కోసం రూ.1.39 కోట్లు చెల్లించి.. చివరకు రిఫండ్ కోసం పట్టు


అయితే, సోషల్ మీడియాలో ఆమె వీడియోలు తరచూ చూసేవారు మాత్రం అసలు విషయాన్ని విడమరిచి చెప్పారు. నెటిజన్లు చెబుతున్న దాని ప్రకారం, ఆ యువతి పేరు తుమా పాషా. ఇన్‌స్టాలో ఆమె ఒక పాప్యులర్ ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమెకు ఏకంగా 2.36 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. సాహసోపేతమైన కంటెంట్‌ పోస్టు చేయడం ఆమెకు అలవాటేనట. గతంలో అనేక సందర్భా్లో ఆమె పెళ్లి కూతురి దుస్తుల్లో భారీ బైకులు నడుపుతూ హల్‌చల్ చేసింది. ఇక తాజా వీడియోకు ఏకంగా 81.7 లక్షల వ్యూస్, 13 లక్షల లైకులు, 23 వేల షేర్‌లు వచ్చాయి.

Viral: అందంగా ఉన్నందుకు పార్టీకి రావద్దంటూ నిషేధం! మహిళకు షాకింగ్ అనుభవం

Read Latest and Viral News

Updated Date - Dec 16 , 2024 | 11:11 PM