Share News

Viral: పెళ్లిలో ఈ వధువు డ్యాన్స్ చూస్తే.. వరుడిలో కొత్త ఊపు!

ABN , Publish Date - May 13 , 2024 | 07:05 PM

పెళ్లిలో వధువు డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వధువు జోష్ చూసి వరుడు కూడా ఉత్సాహంగా రెండు స్టెప్పులేశాడు.

Viral: పెళ్లిలో ఈ వధువు డ్యాన్స్ చూస్తే.. వరుడిలో కొత్త ఊపు!

ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ పెళ్లి వేడుక అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నారు. ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ మొదలు ప్రతి క్షణాన్ని జీవితకాలం గుర్తుండిపోయేలా ఫొటోల్లో నిక్షిప్తం చేసుకుంటున్నారు. ఇక పెళ్లిలో వధూవరులు చూసే హంగామా కూడా ఓ రేంజ్‌లో ఉంటోంది. అలాంటి ఓ పెళ్లి వీడియో ప్రస్తుతం వైరల్‌గా (Viral) మారింది. ఇందులో వధువు ఎనర్జిటిక్ డ్యాన్స్ అక్కడి వారందరినీ ఓ ఊపు ఊపింది. పెళ్లి కొడుకులో కూడా కొత్త జోష్ కనిపించింది.

Viral: వామ్మో.. పాక్‌లో భారతీయ మహిళ ఫుడ్ స్టాల్.. మరీ ఇంత పాప్యులరా!


ఈ పెళ్లి ఎక్కడ జరిగిందో తెలీదు కానీ దక్షిణాది వివాహ వేడుక అని మాత్రం నెటిజన్లు వధువరూల దుస్తులను బట్టి చెప్పేస్తున్నారు. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, సాంగ్ మొదలవగానే వధువు అద్భుతంగా డ్యాన్స్ స్టార్ట్ చేసింది. వరుడికంటే ఎక్కువ ఉత్సాహంతో పర్ఫెక్ట్‌గా స్టెప్పులేసింది. మొదట డ్యాన్స్ చేసేందుకు మొహమాట పడ్డ వరుడిలో వధువు డ్యాన్స్ చూశాక ఉత్సాహం మొదలైంది. తాను తగ్గేదేలేదన్నట్టు స్టెప్పు లేశాడు (Brides dance goes viral on social media).

వీడియోలో ఇదంతా చూసిన జనాలు వధువు ఉత్సాహానికి జై కొడుతున్నారు. పెళ్లి వేడుక అంటే ఇలా ఉండాలంటూ కామెంట్ చేస్తున్నారు. ఉత్సాహవంతులైన మనుషుల చుట్టూ వాతావరణం కూడా ఉల్లాసభరింతంగా ఉంటుందని కొందరు అంటున్నారు. వధువుపై ఎన్ని ప్రశంసలు కురిపించినా సరిపోదని కొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్ అవుతోంది.

Read Viral and Telugu News

Updated Date - May 13 , 2024 | 07:18 PM