Share News

Viral: భారత్‌లో టూర్ తరువాత తీవ్ర విమర్శలు గుప్పించిన బ్రిటీష్ పౌరుడు

ABN , Publish Date - Dec 21 , 2024 | 09:29 PM

భారత పర్యటనకు వచ్చిన ఓ భారత సంతతిని బ్రిటీష్ పౌరుడు ఇక్కడి పరిస్థితులపై తీవ్ర విమర్శలు చేశాడు. అధిక ధరలు ఉండే చెత్త కుప్పగా భారత్‌ను అభివర్ణించాడు.

Viral: భారత్‌లో టూర్ తరువాత  తీవ్ర విమర్శలు గుప్పించిన బ్రిటీష్ పౌరుడు

ఇంటర్నెట్ డెస్క్: భారత పర్యటనకు వచ్చిన ఓ భారత సంతతిని బ్రిటీష్ పౌరుడు ఇక్కడి పరిస్థితులపై తీవ్ర విమర్శలు చేశాడు. అధిక ధరలు ఉండే చెత్త కుప్పగా భారత్‌ను అభివర్ణించాడు. మరోసారి భారత్‌కు రానని తెగేసి చెప్పాడు. రెడిట్‌లో అతడు ఈ మేరకు పోస్టు పెట్టి డిలీట్ చేసినప్పటికీ ఇందుకు సంబంధించి స్క్రీన్ షాట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. పోస్టుపై అనేక మంది తీవ్రంగా విమర్శలు ఎక్కుపెట్టారు.

‘‘ఇక రోడ్ల పరిస్థితి ఏమాత్రం బాలేదు. మౌలికవసతులు కుప్పకూలేటట్టు ఉన్నాయి. ఏ మూల చూసినా చెత్తే కనిపిస్తోంది. ప్రజల్లో సివిక్ సెన్సే కనిపించట్లేదు. ధనిక పేద అంతరం చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ఇక్కడ జీవనం ఆర్థికంగా పెను భారంగా మారుతోంది’’ అంటూ చెప్పుకొచ్చాడు (Viral).

Viral: పార్లమెంటులో పొగతాగిన మహిళా ఎంపీ.. షాకింగ్ వీడియో వైరల్


కాగా, ఈ పోస్టును ఆనంద్ సర్కార్ అనే పర్యాటక రంగ వ్యాపారవేత్త ఎక్స్ వేదికగా పంచుకున్నారు. భారత సంతతి వ్యక్తి చెప్పిన ప్రతి విషయంతో తాను ఏకీభవిస్తున్నట్టు చెప్పారు. ఇక్కడికొచ్చే విదేశీ పర్యాటకులు అనేక మంది భారత్‌లో వాయు కాలుష్యం, అపరిశుభ్రత, మహిళల భద్రత, అస్తవ్యస్థంగా ఉన్న రవాణా సౌకర్యాలు వంటివాటిని లేవనెత్తే వారని అన్నాడు. పర్యాటక ప్రాంతంగా భారత దేశ భవిష్యత్తుపై ఇతర దేశాల్లో నిరాశ తొంగిచూస్తోందని చెప్పుకొచ్చాడు. ఇండియాలోని పర్యాటకులు విదేశాలకు వెళుతున్నారని వాపోయారు. అనేక మంది విదేశీ పర్యాటకులు ఆన్‌లైన్‌లో రివ్యూలను చదువుతున్నారు. విమాన టిక్కెట్ల ధరలు భరింప రానివిగా మారుతున్నాయి’’ అని చెప్పుకొచ్చారు.

Viral: రైలు కిటికీ అద్దాలు పగలగొట్టిన ప్యాసెంజర్లు.. షాకింగ్ దృశ్యాలు వైరల్!


ఈ నేపథ్యంలో భారత పర్యాటక రంగంపై ప్రముఖ 'సినీ రచయిత జావేద్ అఖ్తర్ గతంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. భారత్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని అప్పట్లో ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, వీటిని సద్వినియోగం చేసుకోవట్లేదని కూడా విచారం వ్యక్తం చేశారు. ‘‘ భారత్‌లో సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం ఉంది. తాజ్ మహల్, రాజస్థాన్‌లోని ప్యాలెస్‌లు, దక్షిణాదిన దేవాలయాలు, అజంతా ఎల్లోరా, ఖజురహో వంటి ఎన్నో కట్టడాలు ఉన్నాయి. కానీ మనం మన వారసత్వాన్ని తగిన విధంగా గౌరవించుకోవట్లేదు. మనకు పర్యాటక రంగానికి సంబంధించి సరైన మౌలికసదుపాయాలు ఉండుంటే కేవలం టూరిజం ద్వారానే భారత్ ఆర్థికంగా సుసంపన్నం కాగలదు’’ అని అప్పట్లో వ్యాఖ్యానించారు.

Viral: శోభనం రాత్రి వధువు కోరిక విని షాక్! పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వరుడు

Viral: ప్రియురాలి ఎఫైర్‌తో మనోవేదన! బాధితుడికి రూ.35 లక్షల పరిహారం!

Read Latest and Viral News

Updated Date - Dec 21 , 2024 | 09:36 PM