Viral: ఈ బస్సు డ్రైవర్ గ్రేట్.. అందరూ ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాలే జరగవు!
ABN , Publish Date - Oct 19 , 2024 | 03:21 PM
పక్క వాళ్ల ఏమైపోయినా మనకు అనవసరం అనుకునే జనాలు కోకొల్లలుగా ఉన్న ప్రపంచం ఇది. అయితే, పొరుగు వారికి చేతనైన సాయం చేయాలనుకునే గొప్పమనసున్న వారు కూడా అంతే స్థాయిలో ఉన్నారని చెప్పే వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: పక్క వాళ్ల ఏమైపోయినా మనకు అనవసరం అనుకునే జనాలు కోకొల్లలుగా ఉన్న ప్రపంచం ఇది. అయితే, పొరుగు వారికి చేతనైన సాయం చేయాలనుకునే గొప్పమనసున్న వారు కూడా అంతే స్థాయిలో ఉన్నారని చెప్పే వీడియో నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. పెను ప్రమాదం జరక్కుండా ఓ బస్సు డ్రైవర్ చిన్న ట్రిక్కుతో ఎలా అడ్డుకున్నాడో చెప్పే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసి ఆశ్చర్యపోతున్న జనాలు.. బస్సు డ్రైవర్‌కు జేజేలు కొడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Viral: ఇండియాకు రానా? అంటూ ఎన్నారై ప్రశ్న! రావద్దంటూ నెటిజన్ల గగ్గోలు!
ప్రస్తుతం చాలా హైవేలు మల్టీ లేన్ రోడ్లు అయిపోయాయి. ఓవర్ టేక్ చేయడం సులభంగా మారింది. కానీ, కొంత కాలం క్రితం వరకూ చాలా రోడ్లు సింగిల్ లేన్‌గా ఉండేవి. ఓవర్ టేక్ చేయాలంటే రిస్క్‌తో కూడుకున్న పనిగా ఉండేది. ఎదురుగా భారీ వాహనాలు అడ్డంగా ఉన్నప్పుడు ఓవర్ టేకింగ్ క్లిష్టంగా మారేది. ఇక రాత్రిళ్లు ఇలాంటి సందర్భాల్లో యాక్సిడెంట్లు కూడా జరిగేవి. అయితే, ఇటీవల ఇలాంటి ఓ ప్రమాదాన్ని చిన్న ట్రిక్‌తో తప్పించిన ఓ బస్సు డ్రైవర్‌పై ప్రస్తుతం నెట్టింట ప్రశంసలు కురుస్తోంది.
Viral: కారు కొనద్దన్న ఇన్‌ఫ్లుయెన్సర్‌పై నెట్టింట విమర్శలు!
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, రాత్రి వేళ సింగిల్ లేన్ ఉన్న రహదారిపై ఓ బస్సు, దాని వెనకాల మరో కారు వేగంగా వెళుతున్నాయి. బస్సును ఓవర్ టేక్ చేయాలని కారు డ్రైవర్ ప్రయత్నిస్తున్నప్పటికీ కుదరట్లేదు. ముందు ఆ భారీ బస్సు ఉండటంతో ఎదురుగా వస్తున్న వాహనాలు ఏవీ కనిపించక కారు డ్రైవర్ ఇబ్బంది పడ్డాడు. అయినా రిస్క్ చేసి, ఓవర్ టేక్ చేయబోతుంటే బస్సు డ్రైవర్.. ఎడమవైపున్న ఇండికేటర్‌ను హెచ్చరికగా ఆన్ ఆఫ్ చేశాడు. దీంతో, కారు డ్రైవర్ తన ప్రయత్నాన్ని మానుకున్నాడు. ఆ మరుక్షణమే ఎదురుగా ఓ కారు రయ్యని దూసుకుపోయింది. దీంతో, డ్రైవర్ అప్రమత్తత కారణంగా పెను ప్రమాదం తప్పిపోయినట్టైంది. ఇలా రెండు సార్లు ఆ బస్సు డ్రైవర్ ఇండికేటర్లతో హెచ్చరించడంతో కారు డ్రైవర్ ఎదురుగా వస్తున్న వాహనాల నుంచి తప్పించుకోగలిగాడు.
Viral: ఇంత టాలెంటెడ్‌గా ఉంటే జాబ్ ఇవ్వము! యువతికి షాకిచ్చిన గూగుల్!
వీడియోలో ఇదంతా చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. కారు, బస్సు డ్రైవర్ల మధ్య కోఆర్డినేషన్ అద్భుతంగా ఉందని అనేక మంది కామెంట్ చేశారు. పాతకాలం నాటి సింగిల్ లేన్ రోడ్లపై డ్రైవర్ చేసిన వారికే ఇలాంటి ట్రిక్స్ తెలిసుంటాయని కొందరు అన్నారు. ఈ కాలంలో కూడా బస్సు డ్రైవర్ లాంటి వ్యక్తులు ఉన్నారంటే మానవత్వంపై నమ్మకం కలుగుతోంది అని కొందరు వ్యాఖ్యానించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం వైరల్‌గా మారింది. మరి ఈ ఆసక్తికర వీడియోను మీరూ చూడండి.