Share News

Viral: నన్ను భయ్యా అని పిలవొద్దు.. ప్రయాణికులకు క్యాబ్ డ్రైవర్ వింత కండీషన్

ABN , Publish Date - Oct 14 , 2024 | 09:59 PM

ప్రయాణికుల ప్రవర్తనానియమావళికి సంబంధించి ఓ డ్రైవర్ పెట్టిన రూల్స్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. వీటిని చదివిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. కొందరు ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు.

Viral: నన్ను భయ్యా అని పిలవొద్దు.. ప్రయాణికులకు క్యాబ్ డ్రైవర్ వింత కండీషన్

ఇంటర్నెట్ డెస్క్: డ్రైవర్ జాబ్ అంటే చాలా కష్టంతో కూడుకున్నది. సుదీర్ఘ సమయం పాటు ట్రాఫిక్‌లో ఉండాల్సి వస్తుంది. ఇష్టారీతిన వెళ్లే వాహనాలను తప్పించుకుంటూ గంటలకు గంటలు జాబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ప్రయాణికుల వాహనాలను డ్రైవ్ చేసే వారి కష్టాలు మరింత తీవ్రంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ప్రయాణికుల రకరకాలుగా ఇబ్బంది పెడుతుంటారు. తగవులు పడుతుంటారు. ఇలాంటి అనేక కష్టాలు చవి చూసిన ఓ డ్రైవర్.. దీన్ని భరించేది లేదని నిర్ధారించుకున్నాడు. ఆది నిష్టూరం మేలన్నట్టు..తాను ప్రయాణికుల నుంచి ఆశించేది ఏమిటో చెబుతూ తన సీటు వెనకాల చిన్న పేపర్‌పై రాసి అంటించాడు. ఇది చదివిన జనాలు ఈ మాత్రం స్ట్రిక్ట్‌గా ఉండటంలో తప్పు లేదని కామెంట్ చేస్తున్నారు (Viral).

Viral: వామ్మో.. ఇది రావణ దహనమా..అణుబాంబు విస్ఫోటనమా! షాకింగ్ సీన్స్


ప్రయాణికుల ప్రవర్తనానియమావళికి సంబంధించి అతడు పలు రూల్స్ పెట్టాడు. అవేంటంటే..

  • నువ్వు కారుకు ఓనర్‌లా ఫీలైపోకూడదు

  • కారు నడుపుతున్న వ్యక్తే వాహనానికి ఓనర్

  • డ్రైవర్‌తో మర్యాదగా, హుందాగా మాట్లాడాలి.

  • కారు దిగాక డోరును మెల్లగా వేయాలి.

  • నీకు యాటిట్యూడ్ ఉంటే దాన్ని నీ పాకెట్‌లోనే పెట్టుకో. నా ముందు ప్రదర్శించొద్దు. మీరేమీ నాకు ఎక్కువ డబ్బులు ఇవ్వట్లేదు

  • నన్ను భయ్యా అని పిలవొద్దు.

  • మరో ముఖ్య గమనిక.. త్వరగా డ్రైవ్ చేయాలని తొందరపెట్టొద్దు. మీరు ఇంట్లోంచి టైంకు బయలుదేరండి.

Viral: ఈ టిక్కెట్ ఎక్కడ దొరుకుతుంది.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్


ఇలా ఆ డ్రైవర్ నియమాలతో కూడిన లిస్టును పెట్టుకున్నాడు. అంతేకాదు, తనను త్వరగా డ్రైవ్ చేయమని తొందర పెట్టొద్దన్న నియమాన్ని ఎర్ర అక్షరాలతో ప్రింట్ చేయించాడు. అంటే, ఈ విషయంలో రాజీపడేదే లేదని పరోక్షంగా తేల్చి చెప్పాడు.

తనతో ఎలా వ్యవహరించాలనే విషయాన్ని స్పష్టంగా చెప్పేసిన ఆ క్యాబ్ డ్రైవర్‌పై ప్రస్తుతం నెట్టింట వర్షం కురుస్తోంది. మనిషి చాలా పద్ధతిగా ఉన్నాడని కామెంట్ చేశారు. ప్రయాణికులకు తమ హద్దులు ఏమిటో చాలా స్పష్టంగా, మర్యాదగా చెప్పాడని పేర్కొన్నారు. అయితే, తనను భయ్యా అని ఎందుకు డ్రైవర్ పిలవొద్దన్నాడనే విషయంపై మాత్రం జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.

Read Latest and Viral News

Updated Date - Oct 14 , 2024 | 10:00 PM