Viral: భారతీయులకే జాబ్స్ ఇస్తున్నారు.. కెనడా శ్వేతజాతీయురాలి సంచలన ఆరోపణ
ABN , Publish Date - Oct 07 , 2024 | 08:26 AM
కెనడాలోని ప్రముఖ టిమ్ హార్టన్స్ రెస్టారెంట్ చెయిన్‌లో భారతీయులకే అధిక సంఖ్యలో జాబ్స్ కేటాయిస్తున్నారంటూ స్థానిక శ్వేతజాతీయురాలు చేసిన ఆరోపణ సంచలనంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: కెనడాలోని ప్రముఖ టిమ్ హార్టన్స్ రెస్టారెంట్ చెయిన్‌లో భారతీయులకే అధిక సంఖ్యలో జాబ్స్ కేటాయిస్తున్నారంటూ స్థానిక శ్వేతజాతీయురాలు చేసిన ఆరోపణ సంచలనంగా మారింది (Viral). తాను ఈ విషయంపై గొంతెత్తినందుకు ఉద్యోగంలోంచి తీసేశారని చెప్పుకొచ్చింది. మహిళ చెప్పిన విషయాలను క్లాస్ ఆర్మీనియస్ అనే ఎక్స్ అకౌంట్‌లో ఓ నెటిజన్ షేర్ చేశారు.
క్లాసియస్ అకౌంట్‌లోని పోస్టు ప్రకారం, టిమ్ హార్టన్స్‌లోని భారతీయ మేనేజర్లు భారతీయులనే ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారట. ఇతరులపై వివక్ష ప్రదర్శిస్తున్నారట. వారు ఆశ్రిత పక్షణపాతం, వివక్ష పూరిత వాతావరణానికి కారణమవుతున్నారని మహిళ మండిపడింది. ఈ విషయమై మేనేజ్‌మెంట్‌ను నిలదీసినందుకు తనను ఉద్యోగంలోంచి తీసేశారని ఆమె చెప్పుకొచ్చింది. ఇకపై అక్కడ జరిగే అరాచకాలన్నీ తాను బయటపెడతానని చెప్పుకొచ్చింది.
Viral: రూ.27 వేలకే ఐఫోన్ 16 కొనుక్కుని.. చివరకు విచారం! అసలేమైందంటే..
ఈ పోస్టుకు సహజంగానే నెట్టింట భారీ స్పందన వచ్చింది. మేనేజర్లు తమ వాళ్లకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వడమనే తీరు అస్సలు మంచిది కాదని కొందరు అభిప్రాయపడ్డారు. ‘‘ఒక దేశం లేదా జాతి వారినే జాబ్స్‌లోకి తీసుకోవడాన్ని అడ్డుకునే అనేక చట్టాలు ఉన్నాయి. ఆమె కేసు గనక వేస్తే విజయం తథ్యం’’ అని ఓ వ్యక్తి అన్నాడు. ‘‘తప్పును ఎత్తి చూపినందుకు జాబ్ పోగొట్టుకోవడం నిజంగా అన్యాయం. తన వాణిని వినిపించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది’’ అని అన్నారు.
కొందరు మాత్రం అర్హతలున్న విదేశీయులకూ జాబ్స్ దక్కాలని చెప్పుకొచ్చారు. ‘‘జాబ్స్ తెచ్చుకుంటున్నందుకు విదేశీయులను నిందించడం సరికాదు. అర్హతలున్న ప్రతి ఒక్కరూ అవకాశాలకు అర్హులే’’ అని ఓ వ్యక్తి అన్నారు. ‘‘వలస వచ్చిన వారితో కెనడా దేశ నిర్మాణం జరిగింది. కానీ, దేశంలో ఉన్న అందరికీ సమానావకాశాలు దక్కేలా చూడాలి. కెనడాలోకి కొత్తగా వచ్చిన వారా స్థానికులా అన్న అంశంతో నిమిత్తం ఉండకూడదు’’ అని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు.
Inflation: మీ వద్ద రూ.కోటి ఉందా! 2050 కల్లా ఆ విలువ ఎంత తగ్గుతుందో తెలిస్తే..
కెనడాలో విదేశీయులు ఉపాధి కోసం ఇక్కట్ల పాలవుతున్నారని చెప్పే ఓ వీడియో ఇటీవల నెట్టింట వైరల్‌గా మారింది. వెయిటర్ ఉద్యోగం కోసం పదుల సంఖ్యలో ఎన్నారైలు క్యూకట్టిన తీరు చూసి జనాలు షాకైపోతున్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన వారి కలలు ఇలా కల్లలవడం దారుణమన్న కామెంట్స్ నెట్టింట వెల్లువెత్తాయి. మరోవైపు, కెనడాలో ఇళ్ల అద్దెలు, ధరలు పెరగడానికి విదేశీయులు కారణమన్న ఆరోపణల నడుమ అక్కడి ప్రభుత్వం ఫారినర్ల రాకను కట్టడి చేసేందుకు పలు చర్యలు చేపడుతోంది.