Karnataka: ట్రాఫిక్ పోలీస్‌నే కారుతో ఈడ్చుకెళ్లిపోయాడు.. కర్ణాటకలో షాకింగ్ ఘటన.. వీడియో వైరల్
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:44 AM
కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు చుక్కలు చూపించాడు. అతడిని తన కారు బ్యానెట్‌పై ఎక్కించుకొని కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లాడు. శివమొగ్గలోని సహ్యాద్రి కళాశాల సమీపంలో సాధారణ వాహన తనిఖీ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
కర్ణాటకలో ఓ వ్యక్తి పోలీసులకే షాకిచ్చాడు. శివమొగ్గ (Shivamogga)కు చెందిన ఓ వ్యక్తి ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు చుక్కలు చూపించాడు. అతడిని తన కారు బ్యానెట్ (Car Bonnet)పై ఎక్కించుకొని కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లాడు. శివమొగ్గలోని సహ్యాద్రి కళాశాల సమీపంలో వాహనాల తనిఖీ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు (Viral Video).
మిథున్ అనే వ్యక్తి తన ఎస్‌యూవీ కారులో సహ్యాద్రి కాలేజకు సమీపంలో అతివేగంగా వెళ్తున్నాడు. ఆ ప్రాంతంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. దాంతో మిథున్ కారుకు అడ్డుగా వెళ్లిన ట్రాఫిక్ కానిస్టేబుల్ (Traffic Constable) ప్రభు.. కారున పక్కకు తీసి ఆపాలని సంజ్ఞ చేశాడు. మిథున్ కారును రోడ్డు పక్కన ఆపాడు. కానిస్టేబుల్ ఆ కారు ముందు నిల్చొని ఏదో చెక్ చేస్తుండగా.. మిథున్ ఒక్కసారిగా కారును ముందుకు పోనిచ్చాడు. అప్రమత్తమైన కానిస్టేబుల్ వెంటనే కారు బ్యానెట్‌పైకి ఎక్కాడు. బ్యానెట్‌పై కానిస్టేబుల్ ఉండగానే మిథున్ దాదాపు 100 మీ.. వరకు తీసుకెళ్లి ఆపేశాడు.
కారు ఆపేసి బయటకు దిగి పారిపోయాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. మిథున్ భద్రావతిలో కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నట్టు తెలుసుకున్నారు. మిథున్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఎంత అన్యాయం.. లంచం ఇవ్వలేదని పాస్‌పోర్ట్ చింపేసిన పోస్ట్‌మ్యాన్.. వీడియో వైరల్..
Viral: ఇది ``మంజుమ్మల్ బాయ్స్`` కథ.. మొబైల్ కోసం వెళ్లి గుహలోకి వెళ్లిన యువతికి ఏమైందంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోెసం క్లిక్ చేయండి..