Share News

Viral: ఈ పిల్లి లేకపోతే బుడ్డోడి ప్రాణాలు పోయేవే.. కరెక్ట్ టైంలో ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా..

ABN , Publish Date - Feb 18 , 2024 | 07:20 PM

వీధి కుక్క దాడి నుంచి ఓ బుడ్డోడి ప్రాణాలు కాపాడిన పిల్లి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: ఈ పిల్లి లేకపోతే బుడ్డోడి ప్రాణాలు పోయేవే.. కరెక్ట్ టైంలో ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా..

ఇంటర్నెట్ డెస్క్: పెంపుడు కుక్క అంత విశ్వాసమైనది ఊర కుక్క అంత ప్రమాదకరమైనదీ మరో జంతువు లేదేమో..నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (ViralVideo) చూసిన జనాలు ఇదే కామెంట్ చేస్తున్నారు. ఊరకుక్క పాలపడి ప్రమాదంలో చిక్కుకున్న ఓ చిన్నారి.. పిల్లి రంగం ప్రవేశం చేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ షాకింగ్ విజువల్స్‌పై నెట్టింట పెద్ద చర్చే నడుస్తోంది.

Viral: లోకంలో నిజమైన ప్రేమే లేదా? గర్ల్‌ఫ్రెండ్‌కు మైక్రోసాఫ్ట్‌లో జాబ్ వచ్చేలా చేస్తే..

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ బాలుడు వీధిలో ఆడుకుంటున్నాడు. ఇంతలో ఓ ఊరకుక్క అక్కడున్న ఓ కారు కింద ఏదో వెతికి వెనక్కు మళ్లింది. ఈ క్రమంలో దానికి బాలుడు తారసపడ్డాడు. తెలిసీ తెలియని తనంతో బుడ్డోడు కుక్కవైపు చేయి ఊపుతూ దాన్ని అక్కడి నుంచి తరిమే ప్రయత్నం చేశాడు. దీంతో, ఒక్కసారిగా రెచ్చిపోయిన కుక్క చిన్నారిపై దాడి చేసింది (Cat saves kid from getting mauled by stray dog).

Viral: ఓనర్ ఆంటీ నుంచి కుర్రాడికి ఊహించని మెసేజ్..నన్ను కన్నకొడుకులా చూస్తుంది.. ఇప్పుడేం చేయాలంటూ..


ఇంతలో ఓ పిల్లి సడెన్‌గా సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలుడిపై కుక్క దాడి చూసి దానికి ఏమనిపిచ్చిందో తెలీదు గానీ ఒక్కసారిగా కుక్కపై ఎగబడింది. పదునైన గోళ్లతో పిల్లి దాడి చేస్తుండటంతో కుక్క దృష్టిదానిపై మళ్లింది. కానీ, కుక్క రెచ్చిపోయే సరికి పిల్లి అక్కడి నుంచి పారిపోయింది. ఈ గలాటాతో అప్రమత్తమైన ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకోవడంతో బిడ్డకు ప్రాణాపాయం తప్పింది. అంతమందిని చూసిన కుక్క అక్కడి నుంచి పరారైపోయింది.

మినరల్ వాటర్ తాగుతారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు

వీడియోలో ఇదంతా చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. పిల్లి గనక రాకపోయే ఉంటే పిల్లాడు ప్రాణాపాయంలో పడి ఉండేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. వీధికుక్కల విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవట్లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల్ని వీధుల్లో ఒంటరిగా వదలడం ప్రమాదకరమని కూడా హెచ్చరించారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య ఈ వీడియో రెండు రోజులగా ట్రెండింగ్‌లో (Trending) కొనసాగుతోంది.

Viral: ఈ తండ్రి కష్టం చూస్తే కన్నీళ్లాగవు.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో ఇది!

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 18 , 2024 | 07:26 PM